Tragedy In Honeymoon: ఆ జంటకి పెళ్లై రెండు వారాలు కూడా పూర్తవ్వలేదు. ఎన్నో కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. సుఖసంతోషాలతో తమ దాంపత్య జీవితాన్ని ప్లాన్ చేసుకున్నారు. కానీ.. ఈ దంపతుల్ని విధి కన్నుకుట్టింది. హనీమూన్ ముగించుకొని, ఇంటికి తిరిగి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం నవ వరుడ్ని బలి తీసుకుంది. కర్ణాటకలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దావణగెరె జిల్లా హరిహర తాలూకా జిగళి గ్రామానికి చెందిన సంజయ్(28) బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నాడు. ఇతనికి నవంబర్ 28వ తేదీన బైలహొంగలకు చెందిన ప్రీతితో వివాహమైంది. ఆమె కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. బెంగుళూరులో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్న ఈ జంట.. అందులో ఈ నెల 12వ తేదీన చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. ఈలోపు హనీమూన్‌కి వెళ్లారు. వివిధ ప్రాంతాలను సందర్శించారు.
Malaysia Landslide: కొండచరియలు విరిగిన ఘటనలో 21కి చేరిన మృతుల సంఖ్య.. 12 మంది గల్లంతు
ఆదివారం శిరసి మారికాంబా దేవిని దర్శించుకున్న ఈ నూతన జంట.. తిరిగి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. అయితే.. హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా కొడద వద్ద.. వీళ్లు ప్రయాణిస్తున్న బైక్, ట్రాక్టర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని రాణెబెన్నూరు ఆస్పత్రికి తరలించారు. సంజయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం దావణగెరెకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే.. మార్గమధ్యంలోనే సంజయ్ మృతి చెందాడు. తన భర్తను విగతజీవిగా చూసి.. ప్రీతి కన్నీరుమున్నీరు అయ్యింది. ఎన్నో కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన తమని.. విధి ఇలా అన్యాయం చేస్తుందని అనుకోలేదని ప్రీతి రోధించింది. సంజయ్ మృతితో ఇరువురి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం సంజయ్ మృతదేహాన్ని జిగళి గ్రామానికి తరలించారు.
Army Commander RP Kalita: భారత్-చైనా సరిహద్దుపై ఆర్మీ కమాండర్ సంచలన వ్యాఖ్యలు