Bengaluru woman Murder: బెంగళూర్‌లో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి దారుణహత్యకు గురైంది. బాధితురాలు అద్దెకు ఉంటున్న నివాసంలోని ఫ్రిజ్‌లో ఆమె తెగిపడిన శరీర భాగాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అత్యంత కిరాతకంగా మహాలక్ష్మీని నరికి 52 భాగాలు చేశాడు. ఈ ఘటన యావత్ దేశంలో సంచలనంగా మారింది. మరో శ్రద్ధావాకర్ హత్యను తలపించేలా ఈ ఘటన జరిగింది. గది నుంచి దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Bengaluru chilling murder: శ్రద్ధావాకర్ తరహాలోనే బెంగళూర్‌లో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి దారుణ హత్య జరిగింది. ఈ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన వైనం ఒళ్లు గగుర్పాటు గురయ్యేలా ఉంది. తాజాగా ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ సోమవారం తెలిపారు.
Bengaluru Woman Murder: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూర్‌లో మహాలక్ష్మి దాస్ (28) అనే మహిళని దారుణహత్య సంచలనంగా మారింది. ఈ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని వైయాలికావల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆమె శరీరాన్ని 32 ముక్కలుగా నరికి, ఆమె ఇంట్లోని ఫ్రిజ్ లోనే పెట్టారు. ఫ్రిజ్ కింది షెల్ఫ్‌లో ఆమె తెగిపడిన తల, పైన కాళ్లు, మధ్య భాగంలో మిగిలిన శరీర భాగాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Bengaluru:బెంగళూర్‌లో దారుణం జరిగింది. 29 ఏళ్ల మహిళను కిరాతకంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని 32 ముక్కలు చేసి, ఆమె నివాసంలోని ఫ్రిజ్‌లో దాచిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రస్తుతానికి ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? అనుమానితులు ఎవరు..? అనే వివరాలు తెలియరాలేదు.