Gujarat: రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..
- రూ.1.7 కోట్ల చోరీలో నిందితుల్ని పట్టించిన పోలీస్ డాగ్..
- గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: ఒక రైతు దగ్గర నుంచి రూ.1.07 కోట్లను దొంగతనం చేసిన దొంగల్ని పోలీస్ జాగిలం పట్టించింది. పెన్నీ అనే డాబర్‌మాన్ కుక్క నిందితులను రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకునేలా సాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలోని ధోల్కా తాలూకాలోని సరగ్వాలా గ్రామానికి చెందిన 52 ఏళ్ల రైతు తన గ్రామానికి సమీపంలోని లోథాల్ పురావస్తు ప్రదేశానికి సమీపంలోని భూమిని విక్రయించాడు. దీని ద్వారా అతడికి రూ. 1.07 కోట్లు వచ్చాయి. వచ్చిన డబ్బుతో మరోచోట భూమిని కొనుగోలు చేయాలని యోచిస్తున్నాడు. ఈ డబ్బును రెండు ప్లాస్టిక్ సంచుల్లో నింపి, అక్టోబర్ 10న తన శిథిలమైన ఇంటిలో దాచిపెట్టాడు.
Read Also: Starlink satellites: భూమి చుట్టూ 30,000 శాటిలైట్స్.. ఎలాన్ మస్క్ బిగ్ ప్లాన్..
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఈ విషయం తెలిసిన అదే గ్రామానికి చెందిన బుధ సోలంకి, విక్రమ్ సోలంకి డబ్బును కాజేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే అక్టోబర్ 12న రాత్రి సమయంలో ఇంటి కిటికీల దగ్గర ఇటుకల్ని తీసి ఇంట్లోకి ప్రవేశించి, డబ్బును దొంగతనం చేశారు. మరుసటి రోజు ఉదయం దొంగతానికి సంబంధించిన సమాచారం అందిందని, ఆ ప్రాంతంలో 30 మంది అనుమానితులు, 14 మంది హిస్టరీ షీటర్లను విచారించడం ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
గురువారం పోలీస్ డాగ్ పెన్నీ బుధ ఇంటికి కొంతదూరంలో ఉన్న ప్రదేశంలో ఆగిపోయింది. అప్పటికే బుధ తమ అనుమానితుల జాబితాలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానితులు అంతా ఒక వరసలో నిలబడ్డారు. ఇందులో బుధ సోలంకి కూడా ఉన్నాడు. పెన్నీ అతడి వద్దకు వచ్చి ఆగిపోయింది. పోలీసులు బుధ ఇంటిని చెక్ చేయగా.. రూ.53.9 లక్షలు కనుగొన్నారు. తాము దొంగతనం చేసిన విషయాన్ని అంగీకరించాడు, ఈ చోరీలో విక్రమ్ సోలంకి ప్రమేయం ఉందని సమాచారం ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని విక్రమ్ ఇంటిలో పోలీసులు కనుగొన్నారు. రైతు తన ఇంటికి దూరంగా వెళ్తాడని బుధకు ముందే తెలుసు. దీంతో ఇద్దరు కలిసి పథకం ప్రకారం డబ్బులు కొట్టేశారు. దొంగతనం తర్వాత సమానంగా పంచుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
In a remarkable breakthrough, the LCB & Koth Police Station of Ahmedabad Rural successfully detected a high-profile housebreaking case involving ₹1,07,80,000!
🐕 With crucial assistance from the Dog Squad’s Penny (handled by AHC Valjibhai), who traced the accused’s path and… pic.twitter.com/VqrAnpwYRL
— Harsh Sanghavi (@sanghaviharsh) October 17, 2024
తాజావార్తలు
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?