Chennai: ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్.. 4 నెలల తర్వాత ఏం జరిగిందంటే..!
- ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్
- 4 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘోరం
- తమిళనాడులోకి చెన్నైలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. విద్య ఉన్నవాడు.. విద్య లేని వాడు ఒకే రీతిగా నేరాలు చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే హంతకులుగా మారి భవిష్యత్‌ను పాడుచేసుకుంటున్నారు. తాజాగా చెన్నైలో ఓ వైద్యుడు చేసిన ఘోరం 4 నాలుగు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఆస్ట్రియాకు చెందిన హోమియోపతి వైద్యుడు శామ్యూల్ ఎబినేజర్ సంపత్(34), ప్రియురాలు సింథియా (37), ఆమె తండ్రి శామ్యూల్ శంకర్(78) ఒకే ఇంట్లో ఉంటున్నారు. శామ్యూల్ శంకర్ డియాలసిస్ పేషెంట్. శామ్యూల్ శంకర్ వైద్యం కోసం సింథియా చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా సింథియా.. సంపత్‌కు పరిచయం ఏర్పడింది. శామ్యూల్ శంకర్‌కు సంపత్ డయాలసిస్ చేస్తున్నాడు. హఠాత్తుగా కొద్దిరోజులకే శామ్యూల్ శంకర్ చనిపోయాడు. దీంతో సింథియా-సంపత్ మధ్య వివాదం తలెత్తింది. సరైన వైద్యం చేయకపోవడంతోనే తన తండ్రి చనిపోయాడంటూ సింథియా.. ప్రియుడు సంపత్‌తో గొడవపెట్టుకుంది. ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని చంపేశావంటూ ఘర్షణకు దిగింది. దీంతో కోపంలో సింథియాను సంపత్ తోసేశాడు. కిందపడగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. అంతే ఏం చేయాలో తోయక.. అలా నాలుగు నెలల పాటు అపార్ట్‌మెంట్‌లోనే మృతదేహాలను ఉంచేశాడు. అతడు మాత్రం కంచీపురంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. అయితే దుర్వాసన రాకుండా రసాయనాలు జల్లుతూ వచ్చాడు. దుర్వాసన ఎక్కువ కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకుని డోర్లు ఓపెన్ చేయగా రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాంచీపురంలో నిందితుడు సంపత్‌ను అరెస్ట్ చేశారు. హత్యలకు కారణంపై దర్యాప్తు కొనసాగిస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Damodara Raja Narasimha: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన
తాజావార్తలు
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!