Shocking : హైదరాబాద్‌లోని హాఫీజ్పేట్లో వ్యాపార విభేదాలు రక్తపాతం సృష్టించాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో కట్టెల వ్యాపారి శ్రీనివాస్ (37) దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం, వనపర్తి జిల్లా జంగమయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ గత ఐదు సంవత్సరాలుగా హాఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలోని మంజీరా రోడ్డులో కర్రల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో, స్థానిక వ్యాపారస్తులు సోహెల్, అతని ముగ్గురు సహచరులు అసూయతో కక్ష పెంచుకున్నారు.
Adaso Kapessa: 1985 నుంచి ఇదే ఫస్ట్.. ఎస్పీజీలో తొలి మహిళా ఆఫీసర్..!
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో, “ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నావ్” అంటూ గొడవకు దిగిన సోహెల్ గ్యాంగ్, శ్రీనివాస్‌పై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపరిచి, కర్రల దుకాణం ఎదుట పడేసి పరారయ్యారు. నిందితుల్లో ఒకరు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతున్న క్రమంలో శ్రీనివాస్ మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, సోహెల్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యాపార విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు.