Shocking : హైదరాబాద్‌లోని హాఫీజ్పేట్‌లో వ్యాపార విభేదాలు రక్తపాతం సృష్టించాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో కట్టెల వ్యాపారి శ్రీనివాస్ (37) దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం, వనపర్తి జిల్లా జంగమయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ గత ఐదు సంవత్సరాలుగా హాఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలోని మంజీరా రోడ్డులో కర్రల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో, స్థానిక వ్యాపారస్తులు సోహెల్, అతని ముగ్గురు సహచరులు అసూయతో కక్ష…