Ganja Cultivation in Vizag City: ప్రభుత్వానికి గంజాయి ఆరికట్టడం సవాల్‌గా మారుతుంది.. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో.. ఏజెన్సీ ఏరియాల్లో గంజాయి సాగు కాకుండా.. చూసేందుకు కఠిన చర్యలకు దిగుతోంది ప్రభుత్వం.. ఇదే సమయంలో.. కొన్ని ముఖ్యమైన నగరాల్లో గంజాయి సాగుకు సంబంధించిన వ్యవహారం బయట పడుతోంది.. ఇప్పటికే హైదరాబాద్ లాంటి సీటీల్లో గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్లలోనే గంజాయి సాగు చేసిన ఘటనలతో ఖంగుతున్నారు పోలీసులు.. తాజాగా, విశాఖ నగరంలో గంజాయి పంట కలకలం రేపింది.. కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి పండిస్తున్నారు కొంతమంది యువకులు.. గత రెండేళ్లుగా గంజాయి పండిస్తు మత్తుకు బానిసలుగా మారారు.. ఏజెన్సీ నుండి తీసుకొచ్చి ఇక్కడ పండిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.. గంజాయి సేవించి మిగిలిన వాటిని నగరంలో స్టూడెంట్స్ కి విక్రయిస్తున్నారు గంజాయి గ్యాంగ్.. పక్కా సమాచారంతో గుట్టురట్టు చేశారు విశాఖపట్నం వన్ టౌన్ పోలీసులు.. పంటను పండిస్తున్న ఐదు మంది ముఠా సభ్యులలో ఒకరు మైనర్ ఉండగా మిగతా నలుగురు 20 ఏళ్ల లోపు వాళ్లే ఉండడంతో షాక్ తిన్నారు.. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉండగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.. గంజాయి ఎవరెవరికి విక్రయిస్తున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నమన్నారు పోలీసులు…
Read Also: CM Chandrababu: భవిష్యత్‌లో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే..