Vizag Crime: విశాఖలో దారుణం.. లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. వీడియోలు తీసి..!
- విశాఖలో దారుణం..
- లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం..
- వీడియోలు తీసి బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: ఆడ పిల్ల కనిపించిందంటే చాలు.. కామంతో కళ్లుమూసుకుపోయి కామంధులు రెచ్చిపోతున్నారు.. ఇంటి నుంచి వెళ్లిన చిన్నారులు.. బాలికలు, అమ్మాయిలు, మహిళలు.. వృద్ధులు.. ఇలా తిరిగి సురక్షితంగా ఇంటికి చేరే వరకు కుటుంబ సభ్యుల్లో టెన్షన్ ఉంటుంది.. దేశవ్యాప్తంగా పలు అత్యాచారా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతుండగా.. తాజాగా విశాఖపట్నంలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది..
Read Also: Emotional Scene: కంటతడి పెట్టించే సన్నివేశం.. తండ్రిని చూసి భావోద్వేగానికి గురైన కూతుళ్లు..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
న్యాయం అందకుండా అన్యాయానికి గురవుతున్న ఎంతో మందికి న్యాయసాయం చేయాలన్న ఉద్దేశంతో లా చదువుతోన్న ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు.. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.. బాధితురాలని నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని మళ్లీ మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు.. అయితే, పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. బాధితురాలు మధురవాడలోని NVP లా కాలేజీలో లా థర్డ్ ఇయర్ చదువుతోంది.. ఆమె సహచరి విద్యార్థి అయిన వంశీతో స్నేహం చేసింది.. అయితే, తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ.. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన కంబాలకొండకు తీసుకుని వెళ్లాడు.. అక్కడే విద్యార్థిని ఎంత వారించినా వినకుండా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు..
ఇక, మళ్లీ అదే నెల 13వ తేదీన డాబాగార్డెన్ లో ఉంటున్న తన ఫ్రెండ్ ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ కూడా అక్కడికి వచ్చి ఒకరితర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఇక, ఆ దృశ్యాలు తమ ఫోన్లలో చిత్రీకరించి.. బెదిరిస్తూ.. మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడి.. తమ పశువాంఛ తీర్చుకున్నారు.. అయితే, 2 నెలల తర్వాత మళ్లీ ఆనంద్, రాజేష్, జగదీష్.. బాధితురాలికి ఫోన్ చేసి.. తమ వద్దకు రావాలని కోరిన తీర్చాలని బెదిరించారు.. లేకపోతే పాత వీడియోలు బయటపెడతామంటూ భయపెట్టారు.. దీంతో, ఈ విషయం వంశీకి దృష్టికి తీసుకెళ్లింది బాధితురాలు.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేసిన వంశీ కూడా వారి కోరిక తీర్చాలంటూ మానసికంగా వేధించసాగాడు.. రోజురోజుకీ వేధింపులు ఎక్కువ అవ్వడంతో.. ఈ నెల 18వ తేదీన ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మాహత్యాయత్నం చేసింది బాధితురాలు.. ఇది గమనించిన బాధితురాలి తండ్రి అడ్డుకుని.. ఏం జరిగిందని నిలదీయడంతో.. అసలు విషయం బయటపెట్టింది.. దీంతో.. విశాఖ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు..
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!