తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విజయనగరం జిల్లా ద్వారపూడిలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు కారులో చిక్కుకొని మృతి చెందారు. ఒకే ఇంటిలో ఇద్దరు, వేర్వేరు కుటుంబాలకు చెందిన మరో ఇద్దరు మృతి చెందారు. ఆడుకుంటూ కారులోకి ఎక్కిన చిన్నారులు.. డోర్‌లాక్ కాకవడంతో అందులో చిక్కుకున్నారు.. ఓవైపు ఎండ.. మరోవైపు ఊపిరి ఆడకపోవడంతో.. విలవిలలాడి కన్నుమూశారు..
తమిళనాడులోని రాణిపేట్‌లో స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు (సిప్‌కాట్) వద్ద చర్మశుద్ధి కర్మాగారానికి చెందిన డ్రైనేజీ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు.
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తమ కుమారుడితో అప్పటివరకు హోలీ ఆడి ఆనందంగా గడిపిన దంపతులు.. స్నానం కోసం వెళ్లి బాత్‌రూంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.