అజ్మీర్‌లోని జెఎల్‌ఎన్ ఆసుపత్రిలో ఒక మహిళా వైద్యురాలి కోపం అదుపు తప్పింది. ఆమె 92 ఏళ్ల వృద్ధుడిని చెంపదెబ్బ కొట్టింది.రాజస్థాన్ అజ్మీర్‌లోని జవహార్ లాల్ నెహ్రూ హాస్పిటల్‌లో 92ఏళ్ల వృద్ధుడిపై డాక్టర్ చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం రెసిడెంట్ డాక్టర్ తన ఫ్రెండ్‌తో కలిసి కారిడార్‌లో నడుస్తుండగా.. వృద్ధుడు ఆమెను తాకాడు. దీంతో కోపంతో అతన్ని చెంప దెబ్బ కొట్టింది. వృద్ధుడు క్షమాపణ చెప్పినా కోపం ఆగలేదు. చివరకు సెక్యూరిటీ గార్డు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిచే ప్రయత్నం చేశాడు. ఇక ఈ వీడియోపై సోషల్ మీడియాలో డాక్టర్‌దే తప్పు అన్నట్లుగా చాలా కామెంట్స్ వస్తున్నాయి. కానీ డాక్టర్‌కు కూడా మద్దతు పెరుగుతోంది. నిజానికి వృద్ధుడు చేయి తాకడం కరెక్ట్ కాదని.. ఆమె చెస్ట్‌ను తాకాడని.. ఇది కచ్చితంగా వేధింపుల కిందకు వస్తుందని అంటున్నారు. ఇలాంటి హరాజ్మెంట్ తట్టుకోలేని డాక్టర్ చేయి లేపడంలో తప్పు లేదని అంటున్నారు.
మరోవైపు అక్టోబర్ 10న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై వివరణ కోరింది. ఇప్పటికే ఆస్పత్రి సూపరిండెంట్ స్పందించారు. వృద్ధుడిపై చేయి చేసుకోవడం కరెక్ట్ కాదని.. ఇప్పటికే కమిటీ వేశామని.. రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే వృద్ధుడికి సపోర్ట్ చేస్తున్న వారు డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని… సారీ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
At JLN Hospital in Ajmer, A female doctor's anger spirals out of control,She slapped a 92-year-old elderly man — CCTV footage goes viral 😡
pic.twitter.com/0g0CuX3jHV— Ghar Ke Kalesh (@gharkekalesh) October 11, 2025