Fake Doctor : 10th ఫెయిల్ కానీ.. 20 ఏళ్లుగా BDS డాక్టర్‌గా ట్రీట్‌మెంట్..
- 10వ తరగతి ఫెయిల్.. డాక్టర్‌గా 20 ఏళ్ల దందా
- రాత్రిపూటే క్లినిక్.. అనుమానాస్పద వ్యవహారం
- ఎస్‌ఓటీ దాడిలో బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్లు
- ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరం నకిలీ దందాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా చదువు సంధ్యలు లేకపోయినా ఏకంగా డాక్టర్ అవతారమెత్తి, గత రెండు దశాబ్దాలుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ డెంటల్ డాక్టర్‌ను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ (SOT) పోలీసులు అరెస్ట్ చేశారు. పదో తరగతి కూడా పాస్ కాని వ్యక్తి, ఏకంగా బీడీఎస్ (BDS) చదివినట్లు సర్టిఫికెట్లు సృష్టించి వైద్యం చేస్తుండటం స్థానికంగా కలకలం రేపింది.
Puri Jagannadh : పూరీకి ‘బిగిసిన ఉచ్చు’..సినిమాలు బ్యాన్?
Also Read
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమేష్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తప్పుడు సర్టిఫికెట్లను సృష్టించి, తాను డెంటల్ డాక్టర్‌నని నమ్మబలికాడు. నేరేడ్‌మెట్ ప్రాంతంలో ఒక క్లినిక్ ఏర్పాటు చేసి గత 20 ఏళ్లుగా దంత వైద్య సేవలు అందిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రమేష్ ఒక వింత పద్ధతిని పాటించేవాడు. కేవలం రాత్రి 10 గంటల నుండి ఉదయం వరకు మాత్రమే క్లినిక్ నడుపుతూ రోగులకు చికిత్స చేసేవాడు.
10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు
రమేష్ అందిస్తున్న చికిత్స విధానంపై అనుమానం వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు సదరు క్లినిక్‌పై మెరుపు దాడి చేసి సోదాలు నిర్వహించారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ కనీసం పదో తరగతి కూడా ఉత్తీర్ణులు కాలేదని, అతను చూపిస్తున్న బీడీఎస్ సర్టిఫికెట్లు అన్నీ నకిలీవని తేలింది.
ఎటువంటి వైద్య పరిజ్ఞానం లేకపోయినా 20 ఏళ్లుగా ప్రజలకు దంత చికిత్స చేస్తూ వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న నకిలీ సర్టిఫికెట్లు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇటువంటి నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరకే వైద్యం అందిస్తున్నారని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Dhanush: ‘రాయన్’ అవార్డుపై ధనుష్ స్పందన.. ‘మెయ్యళగన్’ మంచి సినిమానే, కానీ నా బాధ వేరే!
-
Arshdeep Singh: మై పర్సన్.. ప్రేమను అధికారికంగా ప్రకటించిన అర్ష్‌దీప్ సింగ్.. సమ్రీన్ కౌర్ ఎవరు?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rishikanta Singh Chanambam: రోజుకు రూ.200 కూలీ నుంచి కామన్వెల్త్ గేమ్స్ రజత పతకం వరకు.. రిషికాంత సింగ్ ప్రయాణం ఇలా.!
-
Bhagyashri Borse: ఆ సూపర్ స్టార్‌తో డిన్నర్ డేట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన ‘లెనిన్’ హీరోయిన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!