మూఢనమ్మకాలు మనుషులను ఎంతవరకైనా దిగజారేలా చేస్తాయి. మంటలకు చింతకాయలు రాలుతాయి అని నమ్మేవారు ఇంకా లేకపోలేదు. అందుకే ఇంకా దొంగ బాబాల ఆటలు కొనసాగుతున్నాయి. పూజల పేరుతో దొంగబాబాలు అమాయక ప్రజలను నమ్మిచి, ఒకపక్క డబ్బును, మరోపక్క యువతులను మోసం చేస్తున్నారు. తాజగా ఒక దొంగ బాబా యువతి ప్రసాదంలో నిద్రమాత్రలు కలిపి ఆమెను అత్యచారం చేశాడు. అంతేకాకుండా ఆ ఘటనను వీడియో తీసి ఆమె వద్ద డబ్బు గుంజుతున్నాడు. ఇక అతగాడి బాధలు పడలేక యువతి పోలీసులను ఆశ్రయిచడంతో దొంగ బాబా గుట్టు బయటపడింది.
వివరాలలోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం కజకూటంలో దిలీప్ అనే ఒక వ్యక్తి తనకు తాను దేవుడిగా మార్చుకొని మంత్రతంత్రాలతో దెయ్యాలను వదిలిస్తానని చెప్పుకుంటూ తిరిగేవాడు. తన దగ్గర దైవ శక్తులు ఉన్నాయని చెప్పడంతో ఆ గ్రామ ప్రజలు కూడా అతడిని దేవుడు అంటూ కొలిచేవారు. ఇక ఈ నేపథ్యంలోనే తనకు నిశ్చితార్ధం జరిగినా పెళ్లి విషయంలో జాప్యం జరుగుతున్నదని, తన జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో చూడామని ఒక యువతి దేవుడు వద్దకు వచ్చింది. ఆమె సమస్య విన్న దేవుడు.. ఇంటికి వచ్చి పూజలు చేయాలనీ చెప్పాడు. సరే అని యువతి ఇంటికి రమ్మంది.
అదే అలుసుగా తీసుకున్న దేవుడు, యువతి ఇంటికి వెళ్లి ప్రసాదంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. అనంతరం యువతిపై అత్యాచారంకి చేసి, ఆ ఘటన అంటా వీడియోలు తీసాడు. అనంతరం తనకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న యువతి దేవకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతడు ఆమె నగ్న వీడియోలను చూపించి ఆమె వద్ద ఉన్న 30 సవర్ల బంగారం, నగదును దోచేశాడు. అంతేకాకుండా ఈ వీడియోలను చూపించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇక దేవుడు ఆగడాలను తట్టుకోలేని యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దిలీప్ అలియాస్ దేవుడు ని ఆరెస్ట్ చేశారు.