Ex Lover Blackmailed Girl By Sending 1 Rupee Daily On PhonePe: వాళ్లిద్దరు ముందు ప్రేమికులు. కానీ.. అబ్బాయి వికృతచేష్టలు నచ్చక అతడ్ని ఆ అమ్మాయి దూరం పెట్టింది. బ్రేకప్ కూడా చెప్పేసింది. కానీ.. అతడు మాత్రం ‘వదలా బొమ్మాళి నిన్నొదలా’ అంటూ వెంటపడ్డాడు. దాంతో ఆ యువతి అన్ని సోషల్ మీడియా ఖాతాల్లో అతడ్ని బ్లాక్ చేసింది. అయితే.. అతడు తెలివిగా ఫోన్‌పేలో చాట్ చేయడం మొదలుపెట్టాడు. రోజుకో రూపాయి పంపుతూ వేధించసాగాడు. చివరగా బెదిరింపులకు దిగడంతో.. ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. ఇప్పుడు అతడు కటకటాలవెనుక మగ్గుతున్నాడు. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Hair Problem Tips: జుట్టు ఒత్తుగా, మృదువుగా వుండాలంటే ఇలా చేయాలంట!
న్యూబోయిన్‌పల్లికి చెందిన యువతి (25) ఓ ప్రైవేటు ఉద్యోగి. ఈమె మాజీ ప్రియుడు మిహిర్ గణత్ర (26) కూడా ఒక ప్రైవేటు ఉద్యోగే. వీరి మధ్య చిన్నప్పటి నుంచే స్నేహం ఉంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. మొదట్లో వీరి ప్రేమాయణం సజావుగానే సాగింది. కానీ.. కాలక్రమంలో అబ్బాయిలో మార్పు వచ్చింది. 2019 నుంచి యువతిని గణత్ర అసభ్యపదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. ఆమెను అవమానించాడు. అంతటితో ఆగకుండా చెయ్యి కూడా చేసుకునేవాడు. దాంతో.. విసుగుచెందిన ఆ యువతి, అతడ్ని దూరం పెట్టింది. ఇకపై తనని కాంటాక్ట్ చేయొద్దని.. నీకు, నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. మళ్లీ అతడు తనని తిరిగి కాంటాక్ట్ చేయకుండా ఉండేందుకు.. సోషల్ మీడియా ఖాతాలన్నింటిలోనూ బ్లాక్ చేసింది.
Usain Bolt: బోల్డ్‌కి షాక్.. అకౌంట్ నుంచి 97 కోట్లు స్వాహా
అయితే.. మిహిర్ మాత్రం ఆ యువతిని విడిచిపెట్టలేదు. ఫోన్‌పేలో ప్రతిరోజు రూ.1 వేస్తూ వచ్చాడు. కనీసం అలాగైనా తనని తిరిగి కాంటాక్ట్ అవుతుందనే ఉద్దేశంతో.. డబ్బులు వేయసాగాడు. కానీ.. ఆ అమ్మాయి నుంచి రెస్పాన్స్ రాలేదు. దాంతో అతడు ఈనెల 17న ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. మెయిల్ చేశాడు. అది చూసి షాకైన యువతి.. పోలీసుల్ని ఆశ్రయించింది. గణత్ర తనని మానసికంగా వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.