Delhi : ప్రాణం తీసిన పదివేలు.. అక్కాచెల్లెల్లు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పులు ప్రాణాలు తీస్తాయని పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు.. అది నిజమే అని చాలా సార్లు రుజువైంది..అప్పుల వల్ల కుటుంబాలు విచ్చిన్నం అవ్వడమే కాదు ప్రాణాలు కూడా పోతున్నాయి.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది..అప్పు విషయంలో చెలరేగిన ఓ గొడవ ఇద్దరు మహిళల ప్రాణాలను తీసుకుంది. తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి మీద చేసిన దాడిలో అతని ఇద్దరు సోదరీమణులు మృతి చెందడం విషాదాన్ని నింపింది.. ఈ విషాద ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. నైరుతి ఢిల్లీలో ని ఆర్కేపురం అంబేద్కర్ బస్తీలో లలిత్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఒక వ్యక్తికి అతను గతంలో రూ.10వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకుని చాలా రోజులైనా చెల్లించక పోవడంతో.. తన దగ్గర తీసుకున్న మొత్తాన్ని తనకు తిరిగి చేయాలంటూ శనివారం లలిత్ అతడిని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ వ్యక్తి లలిత్ ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అందరూ పడుకున్న సమయంలో.. తనతోపాటు ఓ 20 మందిని తీసుకొని లలిత్ ఇంటికి వచ్చాడు..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
తలుపులు బద్దలు కొట్టడంతో వారంతా బయపడి బందువులకు సమాచారం అందించారు.. వారందరూ రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. వారి మీద కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే లలిత్ ని కాపాడ్డానికి వచ్చిన అతని అక్కాచెల్లెలు పింకీ, జ్యోతి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు.. వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ వారిద్దరూ చనిపోయారు. నిందితులు జరిపిన కాల్పుల్లో ఓ తూటా లలిత్ ను కూడా గాయపరిచింది. కాల్పులు జరిపిన తర్వాత నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
- Tags
- Delhi
- Latest Crime News
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!