DELHI WIFE MURDER: ఢిల్లీలో కాజల్ చౌదరి హత్య సంచలనంగా మారింది. కాజల్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అయిన స్వాట్ కమాండోగా పని చేస్తున్నారు. కాజల్ చౌదరికి 2023లో అంకుర్‌తో వివాహమైంది. అతను రక్షణ శాఖలో క్లర్క్‌గా పని చేస్తున్నాడు. వారిద్దరికీ ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. ఈ మధ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. అంకుర్ కాజల్‌ను కట్నం కోసం వేధించేవాడు . ఈ క్రమంలో ఇద్దరి మధ్య జనవరి 22న గొడవ జరిగింది. ఆ సమయంలో తీవ్రమైన ఆవేశంతో అంకుర్.. కాజల్ చౌదరిపై దాడి చేశాడు. డంబెల్‌తో దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.
అంతే కాదు.. ఆ ఘర్షణకు సంబంధించి అత్యంత భయంకరమైన విషయం వెలుగు చూసింది. అంకుర్.. తన భార్యపై దాడి చేస్తున్న సమయంలో కాజల్ సోదరుడు నిఖిల్‌కు కాల్ చేశాడు. ‘ఈ కాల్ రికార్డ్ చేసుకో, ఇది పోలీసులకు సాక్ష్యంగా పనికొస్తుంది.. నేను నీ చెల్లిని చంపేస్తున్నా’ అని చెప్పి మరీ ఆమెపై దాడికి దిగాడు. అంతే కాదు.. నిఖిల్ ఫోన్ లైన్‌లో ఉండగానే కాజల్ ఆర్తనాదాలు వినిపించాయి. దీంతో నిఖిల్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ‘మీ చెల్లి చనిపోయింది, వచ్చి తీసుకెళ్లు’ అని చెప్పాడు.
కాజల్ కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ అచేతనంగా పడి ఉన్న కాజల్‌ను ఘజియాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె 5 రోజులు మృత్యువుతో పోరాడి.. మృతి చెందింది. కాజల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అంకుర్‌పై తొలుత హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత దాన్ని హత్య కేసుగా మార్చారు. దాడి సమయంలో కాజల్ నాలుగు నెలల గర్భిణీ. పెళ్లిలో బుల్లెట్ బైక్, బంగారం కట్నంగా ఇచ్చినప్పటికీ, కారు ఇవ్వలేదని అతను తరచూ కాజల్‌ను వేధించేవాడని కాజల్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంకుర్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనితోపాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేశారు.