కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పర్సనల్ సెక్రెటరీపై రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు.. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభాలకు గురుచేసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు 71 ఏళ్ల పీపీ మాధవన్‌పై అత్యాచారం అభియోగాలు మోపారు పోలీసులు.. అయితే, దీనిపై స్పందించిన మాధవన్.. కేవలం కాంగ్రెస్ పార్టీ పరువు తీయడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని… అందులో వాస్తవం లేదు. ఇది పూర్తిగా కుట్రగా పేర్కొన్నారు.. ఇక, ఈ కేసుపై వివరణ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. ఓ మహిళపై అత్యాచారం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై కేసు నమోదు చేశాం.. నిందితుడు 71 ఏళ్ల పీపీ మాధవన్‌గా గుర్తించామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు..
Read Also: Ts Inter Results 2022: నేడే ఇంటర్ ఫలితాలు..
ఈ కేసులపై డీసీపీ హర్షవర్ధన్ మాట్లాడుతూ, 71 ఏళ్ల వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. సీనియర్ రాజకీయ నేతకు పీఎస్‌గా పనిచేస్తున్నారు. జూన్ 25న ఫిర్యాదు అందింది. అతడిపై ఐపీసీ 376 (అత్యాచారం) మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.. ఇక, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని మాధవన్ తనపై పలు సందర్భాల్లో అత్యాచారం చేసి వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మహిళ ఫిర్యాదు చేసింది. 2020లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తన భర్తను కోల్పోయాను.. ఆ తర్వాత మాధవన్‌ను కలిశానని, ఆమె భర్త పార్టీ కార్యాలయంలో హెల్పర్‌గా పని చేసేవారని మహిళ తెలిపింది. ఉద్యోగం వెతుక్కుంటూ తరచూ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్తుంటానని చెప్పింది.
అయితే, నా ఆర్థిక పరిస్థితి బాగా లేదు, నేను కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వెళ్లాను, అక్కడ సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ మాధవన్ నంబర్ తీసుకున్నాను. నాకు ఉద్యోగం అవసరమని చెప్పాను మరియు అతను నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేశారని.. జనవరి 21వ తేదీన నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు.. నన్ను చాలా ప్రశ్నలు అడిగాడు.. నా అన్ని పత్రాలను చూశాడు… తర్వాత అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. నేను అవును అన్నాను… ఒక రోజు, అతను నన్ను కలవడానికి పిలిచాడు… అతను నన్ను కారులో పికప్ చేసుకున్నాడు.. డ్రైవర్‌ని కారు వదిలి వెళ్లమని చెప్పాడు.. ఆ తర్వాత నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అభ్యంతరం చెప్పడంతో కోపం తెచ్చుకున్నాడు.. నన్ను ఒంటరిగా రోడ్డుపై వదిలేశాడు అని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
ఇక, నిందితుడు తనకు క్షమాపణ చెప్పాడని, తర్వాత మళ్లీ మాట్లాడుకోవడం ప్రారంభించామని కొన్ని రోజుల తర్వాత మళ్లీ కలవాలని పిలిచాడని.. ఫిబ్రవరిలో కలిసిన సమయంలో నాపై అత్యాచారం చేశాడు. తర్వాత, తన భార్య నా మొబైల్ నంబర్ చూసిందని చెప్పాడు… ఇదంతా విని షాక్ అయ్యాను అని బాధితురాలి పేర్కొంది. ఆ తర్వాత నన్ను వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతం చేశాడు. నేను నిరాకరించాను… నన్ను కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. నేను భయపడ్డాను అని పేర్కొంది బాధితురాలు.. అయితే, జూన్ 25వ తేదీన మహిళ ఫిర్యాదు చేసిందని, వైద్య పరీక్షల నిమిత్తం డీడీయూ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా మాధవన్‌పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.