Uttar Pradesh: దళిత మహిళపై సామూహిక అత్యాచారం.. బీఫ్ తినాలంటూ బలవంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒక దళిత మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు దురాగతానికి ఒడిగట్టారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఓ దళిత మహిళకు ఇద్దరు ముస్లిం యువకులు మత్తుమందు ఇచ్చి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘోరంలో బాధితురాలి స్నేహితురాలైన ఓ ముస్లిం మహిళ కూడా పాలుపంచుకుంది.
బాధితురాలిని ఆమె స్నేహితురాలు ఓ హోటల్ కి రమ్మని పిలిచింది. అక్కడే ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను బీఫార్మ్ విద్యార్థి షోయబ్, బార్బర్ గా పనిచేస్తున్న నజీమ్ గా గుర్తించారు. ఈ మొత్తం అత్యాచార ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించి రూ. 5 లక్షలు ఇవ్వాలని నిందితులు, బాధిత మహిళను బ్లాక్మెయిల్ చేశారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
Read Also: PM Modi-Biden Meet: బైడెన్కి ప్రధాని విందు.. జెట్ ఇంజన్లు, న్యూక్లియర్ టెక్నాలజీపై చర్చలు..
ఈ ఘటన అనంతరం చిత్రీకరించిన వీడియోను బాధితురాలి భర్తకు పంపారు. నిందితులిద్దరు కాశ్మీర్ పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ ఘటన గురించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన ముస్లిం స్నేహితురాలి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బును రిటన్ ఇవ్వాలని అనుకుంది. సెప్టెంబర్ 2న నిందితురాలు ఆమెను ఓ కేఫ్ కి పిలిచింది. అక్కడే ఇద్దరు యువకులు ఉన్నారు. ఆ తర్వాత బాధిత మహిళను ఓ హోటల్ కి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..