Bomb Explosion: పశ్చిమ బెంగాల్‌లో పేలిన బాంబు.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Explosion: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని మానిక్‌చక్ ప్రాంతంలో శనివారం జరిగిన ముడి బాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు గోపాల్‌పూర్ ప్రాంతానికి చెందిన సోఫికుల్ ఇస్లాం (32), ఫజ్రుల్ సేఖ్ (37)గా గుర్తించారు. గాయపడిన ఆలం సేఖ్ (19) మాల్దాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మాల్దా ఎస్పీ ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరంతా గోపాల్‌పూర్ గ్రామంలోని మామిడి తోటలో అక్రమంగా బాంబుల తయారీ చేపట్టారని వెల్లడించారు. పొలంలో బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని వారు తెలిపారు. విచారణ నిమిత్తం పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందం ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంలో ముడి బాంబుల తయారీకి ఉపయోగించే కొన్ని ముడి పదార్థాలు లభించాయని పోలీసులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాంబులు తయారు చేయడానికి గల కారణాలను కూడా నిర్ధారిస్తున్నట్లు తెలిపారు.
Also Read
- Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
- Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
School Girl Death: విద్యార్థిని అనుమానాస్పద మృతి.. తమిళనాడులో ఉద్రిక్తత
బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో ఉందని, పరిస్థితి అదుపులో ఉందని పోలీసు సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో ప్రమేయం ఉన్న ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతోందని, శుక్రవారం ఆ ప్రాంతం నుంచి నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.భూముల విషయంలో అధికార టీఎంసీలో వర్గపోరు కారణంగా గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతం ఉద్రిక్తంగా ఉందని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
-
Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
-
CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
-
RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
-
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!