Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Criminal Lawyer: దొరికితే దొంగ దొరక్కపోతే దొర.. కానీ దొరికినా సరే దొరలా బయట తిరగలనుకున్నాడు. ఇందుకు నల్లకోటు ముసుగులో స్మగ్లర్‌గా మారాడు. ఎక్కడ దొరికితే దొంగగా ముద్ర వేసి జైలుకి తరలిస్తారో అనీ ఏకంగా క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. చట్టంలో లూప్ హోల్స్ ద్వారా తప్పించుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని స్మగ్లర్‌గా మారాడు. ఇంతకీ ఈ 420 వకీల్ సాబ్ చేసే దందా ఏంటో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. గంజాయి కేసుల్లో పట్టుబడ్డ స్మగ్లర్లు కేసులు వాదించడంలో ఈ వకీల్ సాబ్ ముందుంటాడు. ఎంత కాలం అని స్మగ్లర్ల కేసులు వాదించి పబ్బం గడుపుకుంటా … నేనే ఓ స్మగ్లర్‌గా అవతారం ఎత్తితే కోట్ల రూపాయలు వెనక వేసుకోవచ్చని భావించాడు. ప్రొఫెషనల్‌గా.. లాయర్‌గా బిల్డప్ ఇస్తూ నల్ల కోటు మాటున గంజాయి స్మగ్లింగ్ దందా నిర్వహించేవాడు. విశాఖ ఏజెన్సీలో తక్కువ మొత్తానికి గంజాయి కొని ఇతర రాష్ట్రాల్లో కోట్లకు అమ్ముకునే వాడు. ఈ విధంగా గత కొద్ది రోజుల నుంచి పోలీసుల కళ్లుకప్పి కోట్ల రూపాయల విలువైన గంజాయిని సరిహద్దులు చెక్‌పోస్టులు దాటించాడు. పైగా ఇతని పిల్లల్ని ఐఐటీలో చదివిస్తున్నాడు.
చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఎంతటి దందానైనా చేయొచ్చు అని భావించిన ఈ వకీల్ సాబ్ పేరు బి.కృష్ణమూర్తి. రాజమండ్రికి చెందిన కృష్ణమూర్తి వృత్తిరీత్యా క్రిమినల్ లాయర్. క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే ప్రవృత్తిగా గంజాయి స్మగ్లర్‌గా మారాడు. ఒడిశా నుంచి ఏజెన్సీ మీదుగా సరిహద్దులు చెక్‌పోస్టులు దాటించి ఇతర రాష్ట్రాలకు గంజాయి, లిక్విడ్ గంజాయి తరలించడంలో ఇతను పుష్పను మించిపోయాడు. సినిమా రీల్లో పుష్ప పాల వ్యాన్ల ముసుగులో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తే ఈ లాయర్ పుష్ప మాత్రం రియల్ లైఫ్‌లో నల్లకొటు మాటున గంజాయి దందా నిర్వహించేవాడు. నల్లకోటు వేసుకుంటే ఏ చెక్ పోస్ట్ వద్ద తనను ఆపే ధైర్యం ఎవరు చేయరని.. ఒకవేళ ఆపినా లాయర్ అన్న పేరుతో తప్పించుకోవచ్చు అని ప్లాన్ వేశాడు. పెద్ద పెద్ద మొత్తంలో గంజాయి తీసుకెళ్తే అనుమానం వస్తుందని, లిక్విడ్ గంజాయినీ చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తరలించేవాడు.
Also Read
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం చోంపి జంక్షన్ రైల్వే ట్రాక్ సమీపంలో మూడున్నర కేజీల లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన కృష్ణమూర్తి… ఒడిశా నుంచి లిక్విడ్ గంజాయిని తరలిస్తున్నాడన్న పక్కా సమాచారంతో నిందితుడి ఇంటిపై దాడి చేసి లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కృష్ణమూర్తి స్వస్థలం రాజమండ్రిలోని ఇంట్లొ కూడా వేరే బృందం తనిఖీలు చేపట్టగా కేజీన్నర లిక్విడ్ గంజాయి దొరికింది. గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఇతను పాత నేరస్తుడిగా ఇంటిలిజెంట్స్ అధికారులు తెలిపారు. ఇక రెండు చోట్ల పట్టుబడ్డ 5 కేజీల లిక్విడ్ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో కోటి రూపాయల వరకు పలుకుతుందని అంచనా వేశారు. నిందితుని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పాడేరు కోర్టులో హాజరు పరిచారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!