Crime : అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
- అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
- బైక్‌పై శవాన్ని తీసుకెళ్లి పొలాల్లో పడేసిన నిందితుడు
- హత్య వివరాలు మీడియాకు వెల్లడించిన ఏసీపీ నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన మాట వినడం లేదని, ఇతరులతో చనువుగా ఉంటోందని భార్యను అత్యంత కిరాతకంగా చంపిన ఘటన షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బైక్‌పై తరలించి పొలాల్లో పడేసిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. హత్య కు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏసిపి లక్ష్మీనారాయణ మీడియాకు వివరించారు. పోలీసులు తెలిపిన ప్రకారం ఘటన వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేటకు చెందిన పానుగంటి నర్సింలు (31), అదే ప్రాంతానికి చెందిన శోభ అలియాస్ శోభారాణి (33)ని నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కుమార్తె మమత ఉంది. శోభకు అంతకుముందే వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు.
కొంతకాలం సజావుగా సాగిన వీరి సంసారంలో నర్సింలు మద్యానికి బానిస కావడంతో గొడవలు మొదలయ్యాయి. వేధింపులు భరించలేక శోభ తన కుమార్తెతో కలిసి రంగారెడ్డిగూడెంలోని తన తల్లి వద్ద నివసిస్తోంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న నర్సింలు, ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు.మాయమాటలతో పిలిపించి.. ఈ నెల 21న నీ కొడుక్కి సైకిల్ ఇప్పిస్తాను, మహబూబ్‌నగర్‌కు రా అని నర్సింలు శోభను నమ్మించి పిలిపించాడు. ఆమె తన కుమార్తెతో కలిసి రాగా, తన గదికి తీసుకెళ్లి మద్యం సేవించాడు. అక్కడ మళ్లీ గొడవ జరగడంతో, ముందే సిద్ధం చేసుకున్న గ్రానైట్ రాయితో ఆమె తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా రక్తపు మరకలను శుభ్రం చేశాడు. అర్ధరాత్రి సమయంలో శోభ మృతదేహాన్ని మూటకట్టి, బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టుకున్నాడు.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
దానిపైనే తన మూడేళ్ల కుమార్తెను కూర్చోబెట్టుకుని, రంగారెడ్డిగూడెం శివారులోని ఓ పొలం గట్టున పడేసి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలను గమనించి, సోమవారం ఉదయం లింగంపల్లిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, హత్యకు వాడిన రాయి, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మీడియా కు వివరించారు.నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్ కె. సీతారాం, ఎస్ఐలు సుశీల, శ్రీకాంత్, రాజేశ్వర్, శివరెడ్డిలను ఫ్యూచర్ సిటీ కమిషనర్, షాద్‌నగర్ డీసీపీ అభినందించారు.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!