INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- ఇండియా కూటమి నిరసనకు ఎస్పీ దూరం
- ఖర్గే ఏర్పాటు చేసిన లంచ్ సమావేశానికీ అఖిలేష్ గైర్హాజరు
- జంతర్ మంతర్ నిరసనలోనూ కనిపించని సమాజ్‌వాదీ ఎంపీలు
- యూపీ ఎన్నికల ముందు రెండు కాంగ్రెస్-ఎస్పీల మధ్య గ్యాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Bloc: ఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు భారీ నిరసన చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరనసన తెలిపేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, ఈ నిరసనల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) పాల్గొనలేదు. అఖిలేష్ యాదవ్ ఈ నిరసనలకు దూరంగా ఉన్నారు. పార్టీ నేతలు కూడా ఎవరూ ఢిల్లీలో కనిపించలేదు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఎస్పీ నేతలు బుధవారం నిరసనల గురించి తమకు సమాచారం లేదని చెప్పడం గమనార్హం.
Also Read
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన లంచ్ మీటింగ్‌కు తమకు సమాచారం లేదని తొలుత కొందరు ఎస్పీ నేతలు చెప్పగా, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నుంచి తమకు ప్రత్యేకంగా సమాచారం లేదని మరో ఎస్పీ వర్గం చెబుతోంది. అయితే, ఈ వాదనల్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఖండించారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను లంచ్‌కు ఆహ్వానించామని, అయితే మంగళవారం రాత్రి ఆలస్యంగా కార్యక్రమాన్ని ఖరారు చేసి సమాచారం ఇవ్వడంతో కొన్ని పార్టీలు హాజరుకాలేకపోయాయని చెప్పారు.
2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్-ఎస్పీల మధ్య సీట్ల పంపకాల పంచాయతీ ముదిరింది. ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 403 స్థానాలు ఉంటే, కనీసం 150 సీట్లు తమకు కావాలని కాంగ్రెస్ నేతలు ఎస్పీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ అని ఎస్పీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలాన్ని చూసుకుని సీట్లు అడగాలని అంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆ మాత్రం ఎంపీ సీట్లు రావడానికి ఎస్పీతో పొత్తే కారణమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎస్పీ 37, కాంగ్రెస్ 06 ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!