CMRF Fraud : హైదరాబాద్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల గోల్‌మాల్ కేసు దర్యాప్తులో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైనవారు పగడాల శ్రీనివాసరావు (22), యాస వెంకటేశ్వర్లు (50)గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. సెప్టెంబర్ 19న జూబ్లీహిల్స్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో పొట్ల రవి, జంగమ నాగరాజు, మటేటి భాస్కర్, ధర్మారం రాజు, కాంపల్లి సంతోశ్,…