Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
- రాహు-కేతువుల నక్షత్ర సంచారంతో మారనున్న రాశుల ఫలితాలు
- మేష రాశి వారికి ఆర్థికంగా మెరుగైన అవకాశాలు
- సింహ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు
- తుల, కుంభ రాశులకు కొత్త ఆదాయ మార్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేద జ్యోతిషశాస్త్రంలో రాహువు, కేతువులకు ఎంతో ప్రత్యేకమైన, అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. వీటిని సాధారణంగా ఛాయా గ్రహాలు లేదా మాయావి గ్రహాలు అని పిలుస్తారు. జాతక చక్రంలో ఈ రెండు గ్రహాల కదలికలు, నక్షత్ర మార్పులు మానవ జీవితంపై ప్రగాఢ ప్రభావం చూపుతాయి. వీటి సంచార ఫలితంగా వ్యక్తుల జీవితాల్లో ఊహించని వినూత్న మలుపులు, మార్పులు సంభవిస్తుంటాయి. జ్యోతిష్య గణనల ప్రకారం, ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాహు-కేతు గ్రహాల నక్షత్ర సంచారం ఇప్పటికే పూర్తయింది. ఈ గ్రహాలు తమ రాశిచక్రాలను మార్చుకోవడమే కాకుండా, నక్షత్రాలను కూడా మార్చుకోవడంతో ద్వాదశ రాశులపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
4 రాశుల వారికి తెరచుకోనున్న అదృష్ట ద్వారాలు
రాహు, కేతువుల పేర్లు వినగానే చాలామంది ఆందోళనకు గురికావడం సహజం. కానీ ఈ గ్రహాల శుభ దృష్టి ప్రసరిస్తే, సామాన్యులు కూడా అద్భుతమైన ధనయోగంతో రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో చేపట్టిన నక్షత్ర సంచారం ప్రధానంగా నాలుగు రాశుల వారికి సువర్ణకాలాన్ని తీసుకువస్తోంది. ఈ రాశుల జాతకులకు అదృష్టం కలిసి వచ్చి, అపారమైన విజయం , ధనలాభాలు లభించనున్నాయి.
Also Read
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
మేషం , సింహ రాశుల ఫలితాలు
ఈ నక్షత్ర మార్పు మేష రాశి వారికి అత్యంత ప్రయోజనకరంగా మారింది. ఈ సమయంలో మేష రాశి వారు చేపట్టే ప్రతి పని విజవంతమై బంగారంలా ప్రతిఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడటమే కాకుండా, రకరకాల కారణాల వల్ల చాలా కాలంగా పెండింగ్‌లో పడిపోయిన ముఖ్యమైన పనులన్నీ ఇప్పుడు చాలా సజావుగా పూర్తవుతాయి. మరోవైపు సింహ రాశి వారికి ఈ సంచారం ఒక రకంగా సువర్ణయోగం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రమోషన్ లభించడంతో పాటు జీతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఊహించని రీతిలో భారీ లాభాలను ఆర్జిస్తారు, అలాగే సమాజంలోనూ, కుటుంబంలోనూ గౌరవ ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి.
తుల , కుంభ రాశుల వారికి లభించే ప్రయోజనాలు
తులారాశి వారికి రాహు-కేతువుల సంచారం వల్ల అపారమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కారమై, ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఈ కాలంలో వారు చేసే ఆర్థిక పెట్టుబడులు భవిష్యత్తులో రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి. ఇక కుంభ రాశి వారి విషయానికి వస్తే, ఈ శుభ సమయంలో వారి ఆత్మవిశ్వాసం, ఉత్సాహం అత్యున్నత స్థాయిలో ఉంటాయి. వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకోవడానికి బలమైన అవకాశాలు లభిస్తాయి. గతంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడమే కాకుండా, ఆర్థికంగా మరింత బలపడేందుకు అనేక నూతన ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి.
తాజావార్తలు
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!