Charlapalli Case Solved: వీడిన చర్లపల్లి తల్లీపిల్లల సూసైడ్ మిస్టరీ.. ఆ మరణశాసనం వెనుక కారణం ఇదే.!
- చర్లపల్లిలో తల్లీపిల్లల ఆత్మహత్య ఘటన సంచలనం
- సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారంగా పోలీసుల దర్యాప్తు
- కారులో దొరికిన సూసైడ్ నోట్‌తో బయటపడ్డ నిజాలు
- ఒంటరితనం కారణమై ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విశ్లేషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charlapalli Case Solved: బోడుప్పల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ టీమ్ లీడర్ విజయశాంతిరెడ్డి (38), తన కుమార్తె చైతన్య రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17)తో కలిసి జనవరి 31 తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్న సమయంలో వీరు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో మిస్టరీ కొనసాగగా, తాజాగా పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనను కూడా పోలీసులు విచారించారు. కుటుంబంలో ఎటువంటి తగాదాలు లేవని, ఆస్తి పరంగా గానీ, ఆర్థికంగా గానీ ఎటువంటి ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయశాంతి రెడ్డికి తన తోటి ఉద్యోగులతో గానీ, ఇరుగుపొరుగు వారితో గానీ ఎటువంటి విభేదాలు లేవని ప్రాథమిక విచారణలో తేలింది.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
రైల్వే స్టేషన్ వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ ముగ్గురూ చాలా ప్రశాంతంగా ప్లాట్‌ఫారమ్‌లపై తిరుగుతున్నట్లు కనిపించారు. ఎక్కడా వారు భయం గానీ, ఆందోళన గానీ ఉన్నట్లు కనిపించలేదు. ఆత్మహత్యకు ముందు విజయశాంతి తన కారులో ఒక లేఖను (సూసైడ్ నోట్) ఉంచారు. అందులో “మా చావుకు ఎవరూ కారణం కాదు” అని మాత్రమే రాసి ఉంది, కానీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారో స్పష్టంగా పేర్కొనలేదు. ఈ లేఖ కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది.
పోలీసుల విశ్లేషణ ప్రకారం.. విజయశాంతి తీవ్రమైన ఒంటరితనంతో (Loneliness) కుంగిపోయినట్లు తెలుస్తోంది. భర్త విదేశాల్లో ఉండటం, పిల్లలు చదువుల్లో బిజీగా ఉండటం, తానూ ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూ మానసిక వేదనకు గురైనట్లు అనుమానిస్తున్నారు. పిల్లలు కూడా తల్లి మాటే శిరోధార్యంగా భావించి, ఆమె చెప్పినదానికి సమ్మతించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కారులో తల్లి పిల్లలకు చేసిన బోధనలు వారిపై తీవ్ర ప్రభావం చూపి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!