జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. బ్యాంక్ లోన్ కట్టలేదని బ్యాంకు పనులను వదిలిపెట్టుకుని మరీ.. రైతు ఇంటికి వచ్చి గేటును జప్తు చేసి తీసుకుపోయారు డీసీసీబీ బ్యాంక్ అధికారులు.
బ్యాంకు అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వారు ఒక రైతుపొలంలో ప్లెక్సీలు కట్టడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు.
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఈ వార్షిక నివేదికలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులపై గతేడాది అత్యధికంగా అవినీతి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌లోని ఖజానాలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయమైన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.. గురువారం రోజు 25 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు..