Delhi: “స్నేహం” కోసం 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలో ఓ స్కూల్ క్యాబ్ డ్రైవర్ అదే స్కూల్‌లో చదువుతున్న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఢిల్లీలోని సంసద్ మార్గ్ లోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. నవంబర్ 3న బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. ఈ విషయం గురించి పాఠశాల యాజమాన్యం నుంచి బాలిక తండ్రికి సమాచారం అందింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో క్యాబ్ డ్రైవర్‌పై అనుమానంతో కాల్ చేయగా.. అతను లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం మరింత బలపడింది.
క్యాబ్ డ్రైవర్ లోకేషన్‌కి సంబంధించిన వివరాలను పోలీసులు గుర్తించారు. డ్రైవర్ బాలికను బంగ్లా సాహిబ్ గురుద్వారా సమీపంలో దించేసి పరారీలో ఉన్నాడు, ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Read Also: Dharmana Prasada Rao: 75 ఏళ్ల తర్వాత మార్పు వచ్చింది.. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడింది..
గతంలో నిందితుడి క్యాబ్ లోనే బాలిక పాఠశాలకు వెళ్లేది. బాలికపై డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో, అతనే స్వయంగా కూతురును పాఠశాలలో డ్రాప్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో నవంబర్ 3న ఆమెను స్కూల్ గేటు వద్ద దింపిన సమయంలో, క్యాబ్ డ్రైవర్ క్షమాపణ చెబుతాననే నెపంతో బాలికను పిలిచి క్యాబ్ లో బలవంతంగా కూర్చోబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. క్యాబ్ డ్రైవర్ బాలికతో స్నేహం చేయాలని అనుకున్నాడని, కిడ్నాప్ చేసి బాలికతో కలిసి పారిపోయేందుకు యత్నించి పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!