అన్నదమ్ముల మధ్య బంగారం చిచ్చు పెట్టింది. బంగారం కోసం.. బంధాన్ని కూడా మర్చిపోయారు. ఏకంగా అన్న కుటుంబంపై తమ్ముడు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బంధాన్ని పక్కకు పెట్టి అన్నదమ్ములు కొట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది.
MLC Kavitha : పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భద్రాచలం సమీపంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ముంపు గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలు తమకు ఎదురవుతున్న విద్య, వైద్యం, రవాణా వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచే తెలంగాణ జాగృతి…
Caste Discrimination : వసతి గృహాల్లో విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు కుల వివక్షత చూపిస్తున్నారంటూ ఒక బాలిక సెల్ఫీ వీడియో పంపించడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేకెత్తిస్తుంది. తమకు ఈ పురుష ఉపాధ్యాయులు వద్దంటూ మహిళల్ని నియమించాలని కన్నీళ్ళతో వేడుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేట ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కులం పేరుతో తమను దూషిస్తున్నాడు అంటూ లంబాడి…