Bhagya Sri Who Killed Her Brother For Lover Caught After 8 Years: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయి. తమ కామకోరికలు తీర్చుకోవడం కోసం.. అడ్డుగా ఉన్నారన్న నెపంతో అయిన వాళ్లనే చంపుకుంటున్నారు. భర్తల్ని, పిల్లల్ని, ఇంటివాళ్లను.. కిరాతకంగా హతమారుస్తున్నారు. ఇప్పుడు ఓ మహిళ కూడా.. అలాంటి ఘాతుకానికే పాల్పడింది. అప్పటికే భర్తని వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఆమె.. అడ్డుగా ఉన్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చింది. అనంతరం ఎవ్వరికీ తెలియకుండా ప్రియుడితో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింది. కానీ.. చట్టం చేతుల నుంచి వీళ్లు తప్పించుకోలేకపోయారు. ఎలాగైనా నిందితుల్ని పట్టుకోవాలనుకున్న పోలీసులు.. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు వాళ్లను పట్టుకోగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Man Beating Woman: ఢిల్లీలో దారుణం.. యువతిని బలవంతంగా కారులో ఎక్కించి..
భాగ్యశ్రీ అనే మహిళ తన భర్తను వదిలేసి.. బెంగళూరు జిగణి పారిశ్రామికవాడలోని ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరింది. అక్కడికి వచ్చాక.. తన మాజీ ప్రియుడు సుపుత్ర శంకరప్పకు దగ్గరయ్యింది. దీంతో.. వీళ్లిద్దరు వడేరమంచనహళ్లిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, అందులో సహజీవనం చేశారు. ఈ విషయం భాగ్యశ్రీ సోదరుడు లింగరాజ్‌కు తెలిసి.. అతడు మందలించాడు. శంకరప్పకు దూరంగా ఉండాలని గొడవ పడ్డాడు. దీంతో కోపాద్రిక్తురాలైన భాగ్యశ్రీ.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తమ్ముడ్ని హత్య చేయాలని ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం.. 2015 ఆగస్టు 11వ తేదీన తన ప్రియుడు శంకరప్పతో కలిసి లింగరాజ్‌ని హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. ప్లాస్టిక్ సంచిలో నింపుకుని.. వేర్వేరు స్దలాల్లో పడేశారు. అనంతరం ఎవ్వరికీ తెలియకుండా.. మహారాష్ట్రకు చెక్కేసి, అక్కడే మకాం వేశారు. తమ పేర్లు మార్చుకొని జీవించసాగారు.
Ajith: భార్యను వదిలి అజిత్ సీక్రెట్ ఎఫైర్.. ఎవరామె ?
మరోవైపు.. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భాగ్యశ్రీ, శంకరప్ప కలిసి.. లింగరాజుని హతమార్చినట్టు తేల్చారు. వారి కోసం గాలించడం మొదలుపెట్టారు. వారి ఫోటోలను, వేలిముద్రల్ని అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపించారు. అయితే.. వారి జాడ కర్ణాటకలో కనిపించకపోయేసరికి.. మరో రాష్ట్రానికి చెక్కేసి ఉంటారన్న అనుమానంతో, ఇతర రాష్ట్రాలకు వారి ఫోటోల్ని సర్క్యులేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్లు నాసిక్‌లో తలదాచుకున్నట్టు తేలింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. ఆ ఇద్దరిని అరెస్టు చేసి, బెంగళూరుకు తీసుకొచ్చారు.