హైదరాబాద్ లో రోజు రోజుకి వంద FIRలు నమోదు అవుతుంటే.. అందులో 20 సైబర్ క్రైమ్ కేసులే ఉంటున్నాయి. ఇక వనస్థలిపురం బ్యాంక్ లో క్యాషియర్ చోరీ కేసులో కొత్త కోణం చవి చూసింది. క్రికేట్ బెట్టింగ్ వ్యవహారమే చోరీకి కారణమని తేలింది. బెట్టింగ్ లో నష్టపోయి చోరీచేసానని మేనేజర్ కు, సహ ఉద్యోగులకు క్యాషియర్ ప్రవీణ్ మెస్సేజ్ లు పెట్టాడు. బెట్టింగ్ లో డబ్బులు వస్తే తిరిగి ఇస్తాను.. లేదంటే సూసైడ్ చేసుకుంటానని తెలిపాడు. దీంతో ఆశ్చర్యపోయిన మేనేజర్, సహ ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం బ్యాంక్ లో ఉన్న 22 లక్షల 53 వేల 378 రూపాయలతో క్యాషియర్ ప్రవీణ్ పరారైన విషయం తెలిసిందే..దీంతో బ్యాంక్ మేనేజర్ పీర్యాదు తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో.. అలర్ట్ అయిన ప్రవీణ్.. మేనేజర్ కు, సహ ఉద్యోగులకు మేసేజ్‌లు పెట్టాడని పోలీసులు తెలిపారు. డబ్బులు చెల్లించక పోతే ఆత్మహత్య చేసుకుంటానని మేసేజ్ చేసిన ప్రవీణ్ పై సంస్థయాజమాన్యం, పోలీసులు ఏవిధంగా చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
ఏం జరిగింది..మధ్యాహ్నం 3.45 గంటలకు కడుపునొప్పిగా ఉందని, మందులు తెచ్చుకుంటానని బయటకు వెళ్లాడు. సాయంత్రం 4.30 గంటల వరకూ తిరిగి రాలేదు. బ్యాంక్ సిబ్బంది ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ వచ్చింది. బ్యాంక్‌లో నగదు లెక్కించగా రూ. 22,53,378 తక్కువ వచ్చింది. ప్రవీణ్‌కుమార్ నగదు తీసుకొని పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ మేరకు చీఫ్ మేనేజర్ విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే.. ఇదే తరహాలో.. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బ్యాంకు అకౌంట్ ను హ్యాక్ చేసి దినేష్ అనే వ్యక్తి 53 లక్షల రూపాయలను కాజేసిన తీరు హైదరాబాదులో చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ దినేష్‌ను విజయవాడలో అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడి వద్ద నుంచి 17లక్షలు రికవరీ చేయడంతోపాటు.. అతడి వద్ద బ్యాంకుల్లో ఉన్న 14లక్షలు ఫ్రీజ్ చేయడం జరిగిందని సీపీ ఆనంద్ తెలిపారు. నిందితుడి వద్ద 33 క్రెడిట్, డెబిట్ కార్డులు, 12 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విజయవాడ వద్ద మైలవరంలో ఇంజనీరింగ్ చదివిన నిందితుడు దినేష్ ఎలాంటి ఉద్యోగాలు దొరక్క సైబర్ నేరాలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని చెప్పారు. గత మూడేళ్లుగా హ్యాకింగ్ చేసి సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా మళ్లించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని సీపీ ఆనంద్ తెలిపారు.
Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు