Accident : ఎంతో శ్రమించి ఒక్కగానొక్క కొడుకును చదివించి విదేశాలకు పంపి ఉద్యోగంలో స్థిరపడేలా చేశారు. వృద్ధాప్యంలో కుమారుడి వద్దకు కొన్ని రోజులు సంతోషంగా గడిపేందుకు వెళ్లిన దంపతులను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది కుటుంబ పెద్దలు ఇద్దరు చనిపోవడంతో బంధువులంతా విలపిస్తున్నారు. వీరులపాడు మండలం గోకరాజుపల్లి లో విషాదఛాయలఅలుముకున్నాయి గోకరాజు పల్లి కి చెందిన పంచుమర్తి శేషగిరిరావు భార్య అనసూయ నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు కుమారుడు చూసేందుకు భార్య భర్తలు ఇద్దరు నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్లారు. 15 రోజులు కిందట శ్రీనివాస్, భార్య తన కారులో శేషగిరిరావు అనసూయ ఎక్కించుకొని బంధువులు ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది ఆసుపత్రిలో చేర్చారు 15 రోజులుగా చికిత్స పొందుతున్న వారు గత సోమవారం తుదిశ్వాస విడిచారు.ఈ ప్రమాదంలో శ్రీనివాస్ భార్యకు అతని కుమారుడికి గాయాలయ్యాయి అనసూయ పార్థివదేహాలు శనివారం గోకరాజుపల్లి కి తీసుకువచ్చారు.