మద్యం మత్తుకు బలైన మరో నిండు ప్రాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన ఆంక్షలు విధించిన, చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని శిక్షలు పడుతున్నాకానీ కొందరు మారడం లేదు. వారి జల్సాల కోసం మరొకరి ప్రాణాలు తీస్తూ నిందితులుగా మారుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయవద్దంటూ ప్రభుత్వాలు, పోలీసులు చెబుతున్నా పెడచెవిన పెడుతూ ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. అలాంటి ఘటనే ఘట్‌కేసర్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి నిఖిల్‌రెడ్డి మద్యం సేవించి అతి వేగంగా కారు నడుపుతూ ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్‌పై వస్తున్న దంపతులను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న దంపతుల్లో భార్యకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త హనుమాన్ దాస్‌కు కూడా తలకు తీవ్రమైన గాయాలవడంతో గమనించిన స్థానికులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
పారిపోతున్న నిందితుడు నిఖిల్‌రెడ్డిని వెంటాడి మరీ స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న హనుమాన్ దాస్‌కు వైద్యలు ఆపరేషన్ చేయాలని, రూ.15లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. నిందితుడు నిఖిల్‌రెడ్డిపై మర్డర్ కేసు పెట్టాలంటూ హనుమాన్ దాస్ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!