మహారాష్ట్రలోని థానే జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యపై కోపంతో తొమ్మిదేళ్ల కుమారుడిని పొట్టన పెట్టుకున్నాడు ఓ కసాయి తండ్రి. నోట్లో కాగితాలు కుక్కి మరి దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడు తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన థానే జిల్లా సహపూర్ తాలూకా పరిధిలోని కసర ప్రాంతంలోని వశాల వద్ద సోమవారం అర్థరాత్రి రాత్రి జరిగింది. ఘటన జరిగిన సమయంలో 59 ఏళ్ల నిందితుడు మద్యం…