డిప్యూటీ సీఎం పదవి చాలా కాలం నుంచి ఉంది. చాలా మంది ముఖ్యులు ఈ బాధ్యతను స్వీకరించారు. చాలా సంకీర్ణ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎం పదవి ఉండేది. అనుగ్రహ నారాయణ్ సిన్హా భారతదేశపు మొదటి డిప్యూటీ సీఎంగా రికార్డు కెక్కారు. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జూలై 1957 వరకు అనుగ్రహ్ నారాయణ్ సిన్హా బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అతని తర్వాత.. కర్పూరి ఠాకూర్ 1967లో బీహార్‌కి రెండవ డిప్యూటీ సీఎం ఎన్నికయ్యారు. 1967 తర్వాత కాంగ్రెస్ కాస్త బలహీనంగా మారడంతో చాలా రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దీంతో డిప్యూటీ సీఎంలను నియమించాల్సి వచ్చింది. 1967లో చౌదరి చరణ్ సింగ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్‌లో యునైటెడ్ లెజిస్లేటివ్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, జనసంఘ్‌కు చెందిన రామ్ ప్రకాష్ గుప్తా డిప్యూటీ సీఎం అయ్యారు. జనసంఘ్ నాయకుడు వీరేంద్ర కుమార్ సక్లేచా మధ్యప్రదేశ్‌లో మొదటి డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 1967లో గోవింద్ నారాయణ్ సింగ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. కాగా, హర్యానా తొలి డిప్యూటీ సీఎం చౌదరి చంద్ రామ్ ఉండేవారు.
READ MORE: Naseeruddin Shah: ప్రధాని మోడీ ఏదో రోజు ముస్లిం టోపు ధరించడాన్ని చూడాలనుకుంటున్నా..
స్వాతంత్య్రానంతరం ఏర్పడిన తొలి తాత్కాలిక ప్రభుత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ డిప్యూటీ పీఎంగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రి. ఆయన తర్వాత మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, దేవీలాల్, లాల్ కృష్ణ అద్వానీ కూడా డిప్యూటీ పీఎం అయ్యారు. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో దేవీలాల్ డిప్యూటీ పీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు, రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదనే కారణంతో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే, దేవిలాల్ నియామకాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇతర క్యాబినెట్ సభ్యుల మాదిరిగానే మంత్రి అని తీర్పు చెప్పింది.