Ponguleti Srinivasa Reddy: ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీలో పొంగులేటి ధరణి పై మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది అని విశ్వాసంలో ఉన్నారు ప్రజలు అన్నారు. ధరణి నీ ఐఎల్ ఎఫ్ కంపనీకి అప్పగించారని మండిపడ్డారు. కంపనీ నీ కొన్ని కారణాలతో.. సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ కంపనీ కి తెలంగాణ భూములు తాకట్టు పెట్టారు కేసీఆర్ అని మండిపడ్డారు. డిఫాల్ట్ కంపనీ కి ధరణి పోర్టల్ అప్పగించారని అన్నారు. ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన నిర్వాకం… రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇద్దరు వ్యక్తులు కూర్చొని చేసిన చట్టం ధరణి అన్నారు. ఆల్ ఇన్ వన్ గా చెప్పుకున్న పెద్దాయన చేసిన నిర్వాకం ఇది అని తెలిపారు.
Read also: Harassment: కాలం ఎటుపోతుంది.. రెండో తరగతి చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అసభ్య ప్రవర్తన..
ధరణి పేరుతో దగా చేశారు అన్నది నిజం అని అన్నారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రం.. దృతరాష్ట్ర కౌగిలో ఇరుక్కుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి ఎవరు చేసినా గుర్తుపెట్టుకుంటారు ప్రజలు .. ఇందిరమ్మ ని ఇప్పటికి గుర్తు పెట్టుకుంటున్నారని అన్నారు. 2014 లో ధరణి తెచ్చారు కేసీఆర్ అన్నారు. కొండ నాలుక కి మందు వేస్తే…ఉన్న నాలిక పోయినట్టు ఉంది ధరణి అని అన్నారు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తీసుకొచ్చి పేదలకు భూములు పంపిణీ చేసిందన్నారు. వైఎస్ హయాంలో బీడు భూములకు పట్టాలు ఇచ్చారన్నారు. ప్రజలకు మేలు చేసిన వారి పేర్లను ప్రస్తావించడం తగదన్నారు. భూసంస్కరణలతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చాలా మంది చెప్పారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉంది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భూసంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అనేక అంశాలు భూ సంస్కరణలతో ముడిపడి ఉన్నాయి. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా భూసంస్కరణలు చేపట్టారన్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచిన భూదాన ఉద్యమం ఇక్కడే పుట్టిందన్నారు.
CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ తగ్గాయి.. రాజకీయ సభలు ఎక్కువయ్యాయి..