Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Stand Up Rahul Review Rating

రివ్యూ: స్టాండప్ రాహుల్ (కూర్చుంది చాలు)

Published Date :March 18, 2022 , 6:30 am
By NTV WebDesk
రివ్యూ: స్టాండప్ రాహుల్ (కూర్చుంది చాలు)
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

యంగ్ హీరో రాజ్ తరుణ్ కు ఆఖరి హిట్ ఎప్పుడొచ్చింది? అని క్వశ్చన్ చేస్తే ఠక్కున ఆన్సర్ చెప్పడం కష్టమే. కరోనా టైమ్ లో ఒకటి రెండు సినిమాలు ఓటీటీలో విడుదలైనా అవీ పెద్దంతగా వ్యూవర్స్ ను ఇంప్రస్ చేయలేదు. ఇలాంటి టైమ్ లో రాజ్ తరుణ్ కాస్తంత మేకోవర్ తో ‘స్టాండప్ రాహుల్’ మూవీ చేశాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని నందకుమార్, భరత్ ప్రొడ్యూస్ చేశారు. శాంటో మోహన్ వీరంకి డైరెక్టర్ గా పరిచయమౌతున్న ఈ మూవీ శుక్రవారం విడుదలైంది.

కథేంటంటే…

Also Read

  • Sathi Leelavathi Movie Review : లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' మూవీ రివ్యూ
  • Razor Movie Review : రేజర్ మూవీ రివ్యూ
  • M4M Movie Review : 'ఎం4ఎం' రివ్యూ
  • Godari Gattupaina Movie Review : గోదారి గట్టుపైన మూవీ రివ్యూ
Add as a preferred
source on google

స్టాండప్ కామెడీ అనగానే మన తెలుగువాళ్ళకు వెంటనే గుర్తొచ్చేది మొన్నామధ్య వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లోని పూజా హెగ్డే పాత్ర. జీవితంలోని విషాదాన్ని దాచి పెట్టుకుని, నైట్ క్లబ్ లోనూ, ప్రైవేట్ పార్టీలలోనూ నాలుగు జోకులు చెబుతూ గడిపేసే పాత్రను చేసింది ఆమె. దాంతో మనవాళ్ళు స్టాండప్ కమెడియన్స్ జీవితంలో గాఢమైన విషాదం ఉండాలని, దాన్ని ముఖం మీద కనిపించకుండా, గుండెల్లోనే తొక్కి పెట్టేసి, పైకి నవ్వుతూ జోకులు చెప్పి, ఎదుటి వాళ్ళను నవ్వించే క్యారెక్టర్ గా ఫిక్స్ అయిపోయిన్టటుగా ఉంది. దాదాపుగా ఈ మూవీలో రాజ్ తరుణ్ పోషించిన రాహుల్ దీ అదే తరహా పాత్ర. అతని తండ్రి ప్రకాశ్‌ (మురళీశర్మ) ఫిల్మ్ డైరెక్టర్. ఆయన సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా వస్తుంది. కానీ థియేటర్ కు జనాలు మాత్రం రారు. అతనే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కావడంతో జేబులు ఖాళీ అయిపోతాయి. దాంతో ఇంట్లో గొడవలు. రాహుల్ తల్లి ఇందుమతి (ఇంద్రజ) ఎయిర్ హోస్టస్. భర్త సినిమా పిచ్చిని సపోర్ట్ చేసే ఓపిక లేక కొడుకును తీసుకుని విడిపోతుంది. అందువల్ల మన హీరోకు ప్రేమ, పెళ్ళి అనేవి ఓ ట్రాష్ అనే భావన ఏర్పడుతుంది. ఇక హీరోయిన్ శ్రేయ (వర్ష బొల్లమ్మ) రాహుల్ చిన్నప్పటి క్లాస్ మేట్. అతనితో ఆమెకు బాల్యంలో కొన్ని బ్యాడ్ ఎక్స్ పీరియన్సెస్ ఉంటాయి. అయితే వైజాగ్ నుండి జాబ్ కోసం రాహుల్ హైదరాబాద్ వచ్చిన తర్వాత వి. ఆర్. డెవలపింగ్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇద్దరూ మళ్ళీ కలుస్తారు. పాత గొడవలను ప్యాచప్ చేసుకుంటారు. పెళ్ళి మీద పెద్దంత నమ్మకంలేని రాహుల్ ప్రేమను గెలుచుకోవడం కోసం, ఇష్టం లేకపోయినా లివ్ ఇన్ రిలేషన్ కు సిద్ధపడుతుంది శ్రేయ. మరి వారి సహజీవనం సక్సెస్ ఫుల్ గా సాగి పెళ్ళికి దారితీసిందా? స్టాండప్ కమెడియన్ అవ్వాలనుకున్న రాహుల్ కోరిక తీరిందా? ఎందుకూ పనికి రాని వాడిగా ముద్ర వేసుకున్న రాహుల్ దాన్ని చెరిపేసుకోగలిగాడా? అనేది మిగతా కథ.

ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్

అమ్మకూచిగా ఉంటూనే, తండ్రితోనూ గుడ్ రిలేషన్స్ మెయిన్ టైన్ చేసే కొడుకుగా రాజ్ తరుణ్ నటించాడు. మనసుకు నచ్చింది చేయమని తండ్రి చెబితే, ఫ్యూచర్ గురించి ఆలోచించి ముందుకు సాగమని తల్లి హెచ్చరిస్తూ ఉంటుంది. తల్లి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం తండ్రి పాత్రకు దక్కలేదు. మురళీశర్మ లాంటి నటుడిని తీసుకుని కూడా చాలా బలహీనంగా ఆ క్యారెక్టర్ ను రాసుకున్నారు. సినిమా చివరకు వచ్చే సరికీ ఓ ఫెయిల్డ్ హజ్బెండ్ గా ఆ పాత్రను చూపించారు. అదే సమయంలో ఓ పక్క ఉద్యోగం చేస్తూ, అయినవారితో సూటిపోటి మాటలు పడుతూ, కుటుంబ బాధ్యతలు నెరవేర్చే మహిళగా ఇందుమతి క్యారెక్టర్ ను తీర్చిదిద్దారు. ప్రీ క్లయిమాక్స్ ముందు కోడలిని సపోర్ట్ చేస్తూ అత్తగారు మాట్లాడే మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండే సాధకబాధకాలను డైరెక్టర్ శాంటో అవకాశం దొరికినప్పుడల్లా తెలియచెప్పే ప్రయత్నం చేశాడు. అందుకోసం ప్రత్యేకంగా ఓ జంటనూ క్రియేట్ చేశాడు. హీరో, హీరోయిన్ల ఆలోచనల్లో మార్పుకు వారిని ఉదాహరణగా చూపించాడు. కాస్తంత వినోదాన్ని పంచడం కోసం లత, జీపీఎస్ పెయిర్ ను పెట్టాడు. వి. ఆర్. డెవలపర్స్ అధినేతగా ‘వెన్నెల’ కిశోర్ తో కామెడీ చేయించాడు. ఒకటి మాత్రం నిజం ‘వెన్నెల’ కిశోర్ కామెడీ టైమింగ్ కు మ్యాచ్ అయ్యేట్టు చేయడం ఏ ఆర్టిస్టుకైనా చాలా కష్టమే! ఇంద్రజ బాడీ లాంగ్వేజ్ తో ఇందుమతి పాత్రలో డిగ్నిటీ పెరిగింది. మురళీశర్మకు ఇలాంటి పాత్రలు కేక్ వాక్. ఫ్రస్ట్రేటెడ్ సన్ గా, జీవితంలో ఏ నిర్ణయం ఠక్కున తీసుకోలేని కుర్రాడిగా, సమస్యలనుండి ఎస్కేప్ అయ్యే వాడిగా రాజ్ తరుణ్ నటించాడు. కొన్ని సీన్స్ లో తేలిపోయాడు… మరికొన్ని సీన్స్ లో మనసులోని బాధను బాగానే చూపించాడు. ఇక పెళ్ళి, కుటుంబం, అనుబంధం అని తాపత్రయ పడే అమ్మాయిగా వర్ష బొల్లమ్మ సహజనటన ప్రదర్శించింది. స్టాండప్ కమెడియన్స్ క్లబ్ కు చెందిన వ్యక్తిగా ‘కేరాఫ్ కంచరపాలెం’ డైరెక్టర్ వెంకటేశ్ మహా నటించాడు. నటనతోనూ మెప్పించగలనని నిరూపించాడు. ఇతర పాత్రల్లో మధురిమ, దేవి ప్రసాద్, రాజ్ కుమార్ కశిరెడ్డి, తేజోయ్ భట్టార్, అనీశ్ అల్లారెడ్డి తదితరులు నటించారు.

టెక్నీషియన్స్ వర్క్:

నందకుమార్ రాసిన మాటలు అక్కడక్కడా బాగున్నాయి. స్టాండప్ కామెడీ వంకతో కొన్ని చోట్ల టేకిట్ గ్రాంట్ అన్నట్టుగా డైలాగ్స్ హద్దులు మీరాయి. శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాలను చాలా అందంగా చూపించారు. అనంత శ్రీరామ్, రెహ్మాన్ రాసిన పాటలు సాహిత్యపరంగా సాగాయి. ‘తప్పా…’ పాటతో యూత్ బాగానే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ‘పదా… పదమంటోంది పసి ప్రాయం’ గీతం మెలోడీతో బాగుంది. ఇంకొక్క మంచి మాస్ సాంగ్ పడి ఉంటే బాగుండేది. స్వీకార్ అగస్తీ నేపథ్య సంగీతం చక్కగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. కానీ ఓవర్ ఆల్ గా మూవీని చూసినప్పుడు రాహుల్ లో ఉన్న కన్ ఫ్యూజనే థియేటర్లో జనాలకు కలుగుతుంది. ఉద్యోగం చేస్తూ కూడా పేషన్ ను వదులుకోవద్దనే సందేశం వరకూ ఓకే గానీ… పెళ్ళి జంఝాటంలో పడకూడదనుకోవడం, లివ్ ఇన్ రిలేషన్ షిప్ తో అగచాట్లు… ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో వచ్చేశాయి. హీరో, హీరోయిన్ల క్యారెక్టర్లలోని సందిగ్థత ఆడియెన్స్ నూ డైలమోలో పడేస్తుంది. మొత్తం మీద ఏదో చేయాలని… దర్శకుడు శాంటో ఏదో చేశాడనిపించే భావన కలుగుతుంది. సరదాగా టైమ్ పాస్ కోసం ఓ సారి మూవీ చూడొచ్చు. కానీ రాజ్ తరుణ్ ఎదురుచూస్తున్న గ్రాండ్ సక్సెస్ ను మాత్రం ‘ స్టాండప్ రాహుల్’ ఇవ్వలేదు! అన్నట్టు రాజ్ తరుణ్ కు సాలీడ్ హిట్ ఇచ్చిన సినిమా ‘కుమారి 21 ఎఫ్’. ఏడేళ్ళ క్రితం వచ్చిందీ మూవీ!!

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్

  • రాజ్ తరుణ్ మేకోవర్
  • మూవీ టేకింగ్
  • స్వీకార్ అగస్తీ సంగీతం
  • శ్రీరాజ్ సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్

  • నేలవిడిచి సాము చేసే కథ
  • ఆకట్టుకోని కథనం
  • బలహీనమైన పాత్రలు

ట్యాగ్ లైన్: లేచినా నో యూజ్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Raj Tarun
  • Stand Up Rahul
  • Stand Up Rahul Movie Review
  • Stand Up Rahul Review

తాజావార్తలు

  • PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions