Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews A1 Express Movie Review

రివ్యూ : ఎ 1 ఎక్స్ ప్రెస్

Published Date :March 7, 2021 , 1:01 pm
By newsdesk
రివ్యూ : ఎ 1 ఎక్స్ ప్రెస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సందీప్ కిషన్ నటించిన 25వ చిత్రం ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’.  ‘నిను వీడని నీడను నేను’ చిత్రం తర్వాత సందీప్ కిషన్ మిత్రులతో కలిసి నిర్మించిన రెండో సినిమా ఇది. తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ్ ఆది హీరోగా నటించిన ‘నెప్తే తునయ్’కు రీమేక్. సందీప్ తో కలిసి టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాతో డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

కథ విషయానికి వస్తే… యానంలో ఉండే మావయ్య (పోసాని కృష్ణమురళీ) ఇంటికి వెళ్ళిన సంజు (సందీప్ కిషన్) అక్కడి హాకీ ప్లేయర్ లావణ్యతో ప్రేమలో పడతాడు. అయితే… అక్కడి చారిత్రాత్మకమైన చిట్టిబాబు హాకీ స్టేడియంను రాష్ట్ర క్రీడామంత్రి రావు రమేశ్ ఓ కార్పొరేట్ మెడికల్ కంపెనీకి తన స్వప్రయోజనాల కోసం ధారాదత్తం చేయాలనుకుంటాడు. మరి  క్రీడాకారులు ప్రాణంగా భావించే ఆ మైదానాన్ని కాపాడుకోగలిగారా? అందుకోసం సంజు ఎలాంటి సాయం చేశాడు? అనేది అసలు కథ.

నిర్మాతగా సందీప్ కిషన్ తొలి యత్నంగా హారర్ జానర్ మూవీని ఎంచుకుంటే, ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాను తీసుకున్నాడు. రొటీన్ కు భిన్నంగా ఓ కొత్త అంశాన్ని జనం ముందుకు తీసుకురావాలనుకున్న అతని ప్రయత్నాన్ని అభినందించాలి. ఈ కథలో ఉత్తేజపూరితమైన అంశం ఉన్నా… కథనం రొటీన్ గా ఉంది. క్రీడా రంగాన్ని కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నేతలు శాసించడం అనేది ఎంతోకాలంగా జరుగుతున్నదే. అలానే ఈ సినిమాలోనే చెప్పినట్టు ప్రజలు ఏ ఆటను చూడాలనేది, దేనిని ప్రోత్సహించాలనేది సైతం వారి చేతిల్లోకి వెళ్ళిపోయింది. క్రికెట్ తప్పితే మరేదీ గొప్ప ఆట కాదనే భావన తీసుకొచ్చేశారు. ఈ నేపథ్యంలో హాకీ ప్రధానాంశంగా వచ్చిన ‘చెక్ దే ఇండియా’ దేశ వ్యాప్తంగా చక్కని ప్రజాదరణ పొందింది. దాని తర్వాత ఆ స్థాయి విజయాన్ని ఆ ఆట నేపథ్యంలో వచ్చిన ఏ సినిమా పొందలేదు. అందరూ ఆ చిత్ర కథ ఛాయల్లోనే సంచరిస్తున్నారు. ఇది ఒకరకంగా అలాంటిదే. క్రీడా రాజకీయాల కారణంగా మిత్రుడిని కోల్పోయిన ఓ జాతీయ స్థాయి హాకీ ప్లేయర్ తిరిగి హాకీ స్టిక్ చేతిలోకి తీసుకోవడం ఇందులోని ప్రధానాంశం.

పనిలో పనిగా ఈ దేశంలో రాజకీయాల నేతల అవినీతి అక్రమాలు, వారిలో కొరవడిని సిద్ధాంత లేమి అన్నింటినీ దర్శకుడు తెరపై చూపించాడు. ఇక ద్వితీయార్థంలో అయితే… రాజకీయ నేతలు సామ దాన భేద దండోపాయాల తరహాలో… ప్రాంతం, కులం, మతంను అడ్డం పెట్టుకుని తమ పబ్బం గడుపుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో  చూపించాడు. ఇక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో జనం కోరుకునే లవ్ ట్రాక్ కూ దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చాడు. వినోదానికీ చోటు కల్పించే ప్రయత్నం చేశాడు. దాంతో… క్రీడా మైదానాన్ని కాపాడుకోవాలనుకునే పాయింట్ పలచన అయిపోయింది. పైగా ఇటీవల ప్రతి స్పోర్ట్స్ డ్రామా రోమాంచితమైన ఫైనల్ మ్యాచ్ లతో పూర్తవుతోంది. ఇందులోనూ అలాంటి ఓ మ్యాచ్ నే క్లయిమాక్స్ లో పెట్టారు. ఏ సీన్ కు ఆ సీన్ బాగా తీసినా… మొత్తంగా చూస్తే సమ్ థింగ్ మిస్సింగ్ అనే భావన కలుగుతుంది. ఉత్తేజపూరితమైన సంభాషణలు, స్నేహబంధాన్ని తెలిపే సన్నివేశాలు… పాసింగ్ క్రౌండ్స్ మాదిరి వెళ్ళిపోయాయి తప్పితే… మనసుపై బలమైన ముద్రను వేయలేదు. 

నటీనటుల విషయానికి వస్తే సందీప్ కిషన్ తన పాత్ర కోసం ప్రాణం పెట్టాడు. హాకీ స్టిక్ ను నటన కోసం చేతిలోకి తీసుకోవడమే కాకుండా… కొంత ప్రాక్టీస్ కూడా చేశాడు. ఆ హార్డ్ వర్క్ తెర మీద కనిపిస్తోంది. అతని స్నేహితులుగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ చక్కగా నటించారు. ఇప్పటికే ‘మాయవాన్’లో సందీప్ తో కలిసి నటించిన లావణ్య ఇందులో మరో సారి జోడీ కట్టింది. హాకీ క్రీడాకారిణిగా ప్రథమార్థంలో ఆమె పాత్రకు లభించిన గుర్తింపు ద్వితీయార్థంకు వచ్చే సరికీ దక్కలేదు. బట్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. రావు రమేశ్, పోసాని, రఘుబాబు, మురళీశర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. సత్య, మహేశ్ విట్ట వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు. ఇతర ప్రధాన పాత్రలను అభిజిత్, రవి ఆనంద్, శ్రీరంజని, భూపాల్ రాజ్, ఖయ్యుం తదితరులు పోషించారు.  తమిళ చిత్రానికి స్వరాలు సమకూర్చిన హిప్ హాప్ తమిళ తెలుగు వర్షన్ కూ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ర్యాప్ హోరులో చాలా అర్థవంతమైన పదాలు చెవిని చేరనేలేదు. అమిగో పాట చిత్రీకరణ బాగుంది. సింగిల్ కింగులమ్ పెద్దంత ఆకట్టుకోలేదు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ ఓకే. దర్శకుడు డెన్నీస్ జీవన్ కథను ఇంకాస్తంత గ్రిప్పింగ్ గా తీసి ఉంటే బాగుండేది. ఓవర్ ఆల్ గా  ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’ వన్ టైమ్ వాచ్ బుల్ మూవీ. 

ప్లస్ పాయింట్స్
స్పూర్తిదాయకమైన కథ
నటీనటుల నటన
పొలిటికల్ సెటైర్

మైనెస్ పాయింట్
కొత్తదనం లేకపోవడం
మనసుకు హత్తుకోని సన్నివేశాలు


రేటింగ్
2.25 / 5

ట్యాగ్ లైన్
‘నాట్ ఎ1 ఎక్స్ ప్రెస్’!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • A1 express
  • lavanya
  • review
  • sandeep kishan
  • Tollywood

తాజావార్తలు

  • Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా?

  • Donald Trump: ‘‘దయచేసి ఆ పిచ్చివాడిని ఆపండి’’.. రష్యా, చైనాలను కోరిన IAEA మాజీ చీఫ్..

  • Fauzi Movie Leaks: లీకు వీరులకు ‘ఫౌజీ’ టీమ్ సీరియస్ వార్నింగ్.. సైబర్ చర్యలు షురూ!

  • Babu Jagjivan Ram Birth Anniversary: ప్రధాని కావాల్సిన దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబుజీ.. కానీ అడ్డుకున్నది ఎవరు?

  • SRH History: ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. 22 పరుగుల తేడాతో విజయం!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions