Comrade Kalyan Movie Review: కామ్రేడ్ కళ్యాణ్ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Sree Vishnu, Mahima Nambiar, Sudarshan, Sathya, Radhika and others
- DIRECTOR: Janaki Ram
- MUSIC: Vijay Bulganin
- PRODUCER: Venkata Krishna Karnati
శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా వాయిదా పడడంతో ఈ వారానికి ‘కామ్రేడ్ కళ్యాణ్’ పెద్ద సినిమా అయిపోయింది. కోన వెంకట్ సమర్పణలో ఒక కొత్త నిర్మాత నిర్మించిన ఈ సినిమాతో జానకిరామ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. టైటిల్‌తోటే ప్రేక్షకుల ఆసక్తిని చూరగొన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కామ్రేడ్ కళ్యాణ్ కథ:
మాడుగుల అనే ఏజెన్సీ ప్రాంతంలో కళ్యాణ్ (శ్రీవిష్ణు) తన స్నేహితుడు సుదర్శన్‌తో కలిసి ఒక టూరింగ్ టాకీస్ లీజుకు తీసుకుని నడిపిస్తూ ఉంటాడు. పెద్దగా టెన్షన్లు లేకుండా సాగిపోతున్న అతని జీవితంలోకి సితార (మహిమా నంబియార్) ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు కళ్యాణ్. ఆమె ఒరియా అమ్మాయి అని తెలియడంతో ఒరియా నేర్చుకుని ఆమెను ప్రేమలో పడేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతనికి సితార గురించి, ఆమె కుటుంబం గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అంతేకాక ఆమె కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలిసి, ఆ ఇబ్బందులు దూరం చేయడానికి కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఆ సంచలన నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం వల్ల కళ్యాణ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ
ఓ సాధారణ ఐడియాను శ్రీవిష్ణు శైలి వినోదంతో మేళవించి తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ సరదా సన్నివేశాలు, పంచ్‌లతో సాఫీగా సాగిపోయినప్పటికీ, సెకండ్ హాఫ్ లో అదే స్థాయి వినోదం, పట్టు లోపించాయి. కథా బలం కంటే హీరో టైమింగ్ మీదే ఎక్కువ ఆధారపడ్డ సినిమా ఇది. సాధారణంగా నక్సలిజం, అడవి, తుపాకుల మోత అనగానే హెవీ ఎమోషన్స్, సీరియస్ ఐడియాలజీ డ్రామా అనుకుంటాం. కానీ ఈ సినిమా ఆ మూస పద్ధతిని పూర్తిగా పక్కన పెట్టేసి, ఆ ఇంటెన్స్ సెటప్‌ను ఓ క్రేజీ ‘సిట్యువేషనల్ కామెడీ’గా మార్చేసింది. స్టార్టింగ్‌లో కథ కాస్త క్యాజువల్ నోట్‌తో మొదలైనప్పటికీ, అసలైన కామెడీ గ్యాంగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చాక మీటర్ పూర్తిగా మారిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కథకు మంచి బజ్ క్రియేట్ చేయగా, సెకండాఫ్‌లో స్క్రిప్ట్ నేరుగా అడవిలోకి షిఫ్ట్ అవుతుంది. అయితే అక్కడ కూడా కథ సీరియస్ ట్రాక్‌లోకి వెళ్లకుండా, అన్నలు-ఎన్కౌంటర్ల సెటప్‌లోనే స్పూఫ్, బ్లాక్ కామెడీ వైబ్స్‌తో సీన్లను పేల్చేశారు. లాజిక్కుల కంటే ఆడియన్స్‌ని వైబ్ చేయడమే టార్గెట్‌గా రచన ఉంది. కథ 90ల టైమ్‌లైన్‌లో నడిచినా, ఇప్పటి మీమ్ కల్చర్, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లు, స్టార్ హీరోల ట్రెండింగ్ పంచ్‌లతో రాసిన వన్-లైనర్స్ బీ ,సీ సెంటర్ల థియేటర్లలో అదిరిపోయే క్రౌడ్ పుల్లింగ్ మూమెంట్స్‌ని ఇస్తాయి. క్లైమాక్స్‌లో రొటీన్ మెసేజ్, డ్రామా కాస్త డల్ చేసినా… లాజిక్‌లతో పనేం లేదు, కాసేపు హాయిగా నవ్వుకుని రిలాక్స్ అవ్వాలనుకునే వాళ్లకు ఈ సినిమా ఒక పక్కా టైమ్‌పాస్ ఆప్షన్.
నటీనటుల ప్రతిభ విషయానికి వస్తే శ్రీవిష్ణు తనదైన సహజసిద్ధమైన కామెడీ టైమింగ్‌తో సినిమాను ముందుండి నడిపించారు. ప్రత్యేకించి కథానాయకుడి పాత్రను తన శైలికి తగ్గట్టుగా మలచుకొని, చిన్న చిన్న సంభాషణలతోనూ కావాల్సినంత వినోదాన్ని పండించగలిగారు. సత్య మరోసారి తన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ, ద్వితీయార్థంలో ఆయన పాత్ర పరిధి కాస్త తగ్గిందనిపిస్తుంది. ఇక ఉపేంద్ర లిమాయే రెగ్యులర్ పాత్రలోనే కనిపించగా, షైన్ టామ్ చాకో పాత్రకు పెద్దగా ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం దక్కలేదు. రాధిక పాత్ర ప్రారంభంలో ఆసక్తికరంగా మొదలైనా తర్వాత ప్రాధాన్యం కోల్పోయింది; హీరోయిన్ పాత్ర కూడా నామమాత్రంగానే పరిమితమైంది.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే సంగీత విభాగంలో ‘ఒరియా పిల్ల’తో పాటు ఆర్.నారాయణమూర్తి శైలిని గుర్తుచేసే విప్లవ గీతం కూడా సందర్భోచితంగా ఉత్సాహాన్ని నింపుతాయి. అవసరం లేని ఒక ట్రాక్ ఎడిటింగ్‌లో తొలగించడం ద్వారా కథనం వేగానికి మేలు జరిగింది. సమకాలీన అంశాలు, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లతో కూడిన సంభాషణలు అక్కడక్కడా సరదాగా పేలాయి. ఎడిటింగ్ ప్రథమార్ధంలో ఉన్నంత చురుగ్గా ద్వితీయార్థంలో సాగలేదు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ కామ్రేడ్ కళ్యాణ్.. కామెడీ కళ్యాణే.. కానీ!!
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!