ఎమ్మెల్యే ధర్మాన కామెంట్స్‌తో కలకలం…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీలో ఆయనో కీలకనేత. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారపక్షంలో ఉన్నా తాను చెప్పాల్సింది కుండబద్ధలుకొట్టి మరీ చెప్పేస్తారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ ఆ కోవలోకే చేరాయి. మంత్రి పదవి రాలేదని అక్కసా? లేక తప్పొప్పులు చెప్పకొంటే తనకూ మిగిలినవాళ్లకూ తేడా ఏంటని అనుకుంటున్నారో.. మాటలతోనే మంటెక్కిస్తున్నారు. దీంతో అదేంటి అన్నాయ్.. ఆయన అలా అనేశారేంటి అని అంతా చర్చించుకుంటున్నారట.
స్వపక్షంలో విపక్షంగా మారిన తీరుపై చర్చ!
Also Read
- Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
- Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
- Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
- Chairman's Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ధర్మాన ప్రసాదరావు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఈ మాజీ మంత్రి ఇటీవలకాలంలో ఏం మాట్లాడినా వైసీపీలో చర్చగా మారుతోంది. ఏడాది క్రితం YSR జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా విభజనపై తన గళం వినిపించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు విభజిస్తే సిక్కోలుకు తీరని నష్టం వాటిల్లుతుందని ఓపెన్‌గానే చెప్పేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మానతో జిల్లా నేతలందరూ ఏకీభవించాల్సి వచ్చింది. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా కూడా జరిగింది. స్వపక్షంలోనే విపక్షంగా మారిన మాజీ మంత్రి తీరు ప్రతిపక్షాలకు షాకిచ్చింది.
కేడర్‌లో అసంతృప్తి ఉందని ఓపెన్ కామెంట్!
కోవిడ్ సమయంలో కొన్నాళ్లు క్యాంప్ ఆఫీస్‌కే పరిమితమైన ప్రసాదరావు.. పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల వేళ మరో బాంబ్ పేల్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం, అసంతృప్తి నెలకొన్నాయని ముఖ్యనేతల సమావేశంలో కుండబద్ధలు కొట్టేశారు. ఆ సమయంలోనూ ప్రసాదరావు వైఖరికి పార్టీ నేతలు ఆశ్చర్యపోయారట.
మార్కెట్ కమిటీ డైరెక్టర్ల పదవీకాలంపై అసహనం!
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాదరావు మార్కెట్ కమిటీల డైరెక్టర్ల పై చేసిన కామెంట్స్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. సిక్కోలు రైతాంగాన్ని ఆదుకునేందుకు నాడు రాజశేఖర్‌రెడ్డి.. నేడు ఆయన కుమారుడు సీఎం జగన్ కృషి చేస్తున్నారంటూనే.. మార్కెట్ కమిటీల డైరెక్టర్ల పదవీకాలంపై తన మనసులో మాటను బయటపెట్టేశారు. ప్రతినిధులు లేకుండా కమిటీలు దేనికి.. రెండు నెలలు ఒకరు.. ఆరు నెలలు ఇంకొకరు.. ఇదేం పద్ధతని అసహనం వ్యక్తం చేశారు. ప్రయోజనంలేని పదవులు దేనికి.. పూర్తికాలం పనిచేసేలా అవకాశం ఉంటే డైరెక్టర్లుగా ఉన్నవారు ఉత్సాహంగా పనిచేస్తారని స్పష్టం చేశారు.
అదేంటి అన్నాయ్..! పెద్దాయన అలా అనేశారు!!
ప్రసాదరావు చేసిన ఈ కామెంట్స్‌పైనే చర్చ జరుగుతోంది. కొందరేమో అదేంటి అన్నాయ్ పెద్దాయన అలా అనేశారు అని చెవులు కొరుక్కుంటున్నారట. మరికొందరు మాత్రం ధర్మాన ఏం మాట్లాడినా ఓ అర్ధం ఉంటుందిలే అని సరిపెట్టేసుకుంటున్నారట. ఏదేమైనా.. ధర్మాన అదునుచూసి చేస్తున్న కామెంట్స్‌తో ఇరకాటంలో పడుతున్నామని కొందరు నాయకులు అనుకుంటున్నారు. మరి.. హైకమాండ్ ఏం చేస్తుందో? స్వపక్షంలో సరైన గొంతు అనుకుంటుందా.. లేక విపక్షంలా మాట్లాడుతున్నారు అని భావిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!