Chairman’s Desk: రాష్ట్రంలో లిక్కర్ స్కాంలు, నకిలీ లిక్కర్, బినామీ పేర్లతో బ్రాందీ షాపులు, పర్మిట్ రూంలు, బెల్ట్ షాపులు.. ఇవి తప్ప వేరే మాటలు వినిపించవా? గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం లిక్కర్ మీదే బతుకుతున్నాయా? ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం వ్యవహారం చూస్తుంటే.. ఏపీలో రాజకీయాలు మద్యంవ్యాపారాలు ఎలా కలగలిసిపోయి ప్రయాణిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అసలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికి లిక్కర్‌తో సంబంధం లేకుండా నడిచే పరిస్థితి లేదా? కొన్నేళ్లుగా ప్రభుత్వమే నేరుగా లిక్కర్ వ్యాపారం చేసి.. మరి కొన్నేళ్లు నకలీ మద్యాన్ని అరికట్టేలేక చతికిల పడింది. ఎటు చూసినా మద్యం వ్యాపారం చుట్టే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.
Read Also: YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన.. ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు
2019-24 మధ్య జగన్ సర్కారు.. నేరుగా లిక్కర్ వ్యాపారం చేసి పరువు పోగొట్టుకుంది. మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చి అధకారంలోకి వచ్చిన జగన్.. చివరికి ప్రభుత్వమే లిక్కర్ అమ్ముకునే స్థితికి దిగజార్చాడు. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే.. సర్కారు లిక్కరర్ అమ్మడం! సొంత బ్రాండ్లు సృష్టించడం. మద్యం వేలం పాటలు, తయారీ, అమ్మకాలు ప్రభుత్వం చేయడమేంటి? అసలు ప్రభుత్వానికి మందు అమ్ముకోవడం తప్ప వేరే పనిలేదా? లిక్కర్ అమ్ముకుంటేనే సర్కారు బండి నడుస్తుందా? ప్రభుత్వాలు ఇంతగా దిగజారిపోవాలా? ఐదేళ్ల పాటు జగన్ చేసిన ప్రభుత్వ లిక్కర్ వ్యాపారం దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం పరువు తీసింది. లిక్కర్ అమ్మకాల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందా లేదా అనేది న్యాయస్థానాలు తేలుస్తాయి. కానీ అసలు సర్కారే లిక్కర్ అమ్ముకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందో లోతుగా ఆలోచించాల్సిన విషయం. దీనివల్ల ప్రభుత్వాలు, పార్టీలు వ్యక్తిగత ప్రతిష్ట కూడా దిగజారిపోతుందన్న విషయాన్ని గుర్తించాలి.
Read Also: Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్.. నెతన్యాహు దంపతులు ఘనస్వాగతం
గత సర్కారు చేసిన లిక్కర్ వ్యాపారాన్ని ఎండగడుతూ అధికారంలోకి వచ్చిన కూటిమి సర్కారు.. ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యాన్నే అరికట్టలేక అంతకన్నా ఘోరమైన అప్రతిష్టను మూటగట్టకుంది. ప్రజారోగ్యం, ప్రజాసంక్షేమం, ఆరోగ్యాంధ్రప్రదేశ్.. ఇన్ని డైలాగులు చెబుతున్న పార్టీలు, ప్రభుత్వాలు ప్రజల చేత విచ్చలవిడిగా తాగించి, ఆదాయాన్ని చూసుకుని మురిసిపోతున్నాయి. ప్రజలకు మద్యం అమ్ముకోవడం.. డబ్బు సంపాదించడమేనా.. సంపద సృష్టి అంటే? ప్రభుత్వాలు ఇంత దిగజారి సంపద సృష్టించాల్సిన అవసరం ఉందా? జగన్ సర్కారు లిక్కర్ అమ్మకాలను బూచిగా చూపి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. చివరికి తాను కూడా ఆ ఊబిలోనే కూరుకున్నారు.
Read Also: Minister Nadendla: రేషన్ బియ్యాన్ని గుర్తించేలా ర్యాపిడ్ కిట్స్..
ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఏకంగా ఒక పెద్ద ఫాక్టరీయే పెట్టి.. నకిలీ మద్యం తయారుచేసి, రాష్ట్రం మొత్తం సప్లయ్ చేస్తున్నారంటే.. ఎంతపెద్ద నెట్వర్క్ నడుపుతున్నారో ఊహించుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడో ఒకమూల తయారైన మద్యం ఏపీ, తెలంగాణకు విస్తరించిందంటే ఎవ్వరి సహాయసహకారాలు లేకుండానే జరుగుతోందా? ఎక్కడ చిత్తూరు.. ఎక్కడి ఇబ్రహీంపట్నం.. ఎక్కడ నల్గొండ.. ఎక్కడ పాలకొల్లు? ఇన్ని ప్రాంతాలకు నకిలీ మద్యం విచ్చలవిడిగా సప్లయ్ అయిందీ అంటే.. ఎంత బలమైన నెట్ వర్క్ ఉండాలి? పోలీసులు, ఎక్సైజ్ వ్యవస్థలు ఆదమరిచి వున్నాయా? లేక ఆమ్యామ్యాలకు అలవాటు పడి పోయాయా? నకిలీ మద్యం నిందితులు నీవాళ్లంటే.. నీవాళ్లని.. నీ పార్టీ నుంచి నా పార్టీకి వచ్చారని.. ఎవరికి వాళ్లు రాజహంసల్లా మురికి చేతులకు అంటకుండా కడిగేసుకుంటున్నారు.
Read Also: Trump: ఇజ్రాయెల్‌కు బయల్దేరేటప్పుడు భారీ వర్షం.. గొడుగుతో ఇబ్బంది పడ్డ ట్రంప్.. వీడియో వైరల్
తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్‌కి సంబంధించి ఏ దుర్మార్గాలు చేయాలన్నా రాజకీయ పార్టీల అండదండలు లేకుండా జరగవు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజలకు స్వచ్ఛమైన మందు పోస్తానని చాలా విచిత్రమైన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ.. తన హయంలోనే నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతుంటే ఏం చేయలేక చేష్టలుడిగి చూస్తోంది. నకిలీ మద్యం బెల్టు షాపుల్లోనూ పర్మిట్ రూముల్లోనూ రాజకీయ బహిరంగ సభల్లోనూ విచ్చలవిడి పొంగిపొరలుతోంది. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా?
Read Also: Balakrishna : బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి.. కార్యకర్తల డిమాండ్
అప్పుడు జగన్ సర్కారు తానే మద్యం అమ్ముకుని బ్రష్టుపట్టిపోతే.. ఇప్కుడు చంద్రబాబు సర్కారు నకిలీ మద్యాన్ని అరికట్టలేక భ్రష్టుపట్టిపోయారు. అసలు ప్రభుత్వం యంత్రాంగంలో మద్యం తప్ప మరో వ్యవహారం లేదా? ఇదే అందరికీ జీవనాధారమా? రాష్ట్రంలో వైన్ షాపులతో సంబంధం లేని ఎమ్మెల్యేలు ఎంతమంది? ఎమ్మెల్యేలందరికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వైన్ షాపుల్లో వాటాలుంటాయి. టెండర్లను బినామాలే దక్కించుకుంటారు. తమ అనుచరులకే ఎమ్మెల్యేలు, మంత్రులు వైన్ షాప్, బార్ లైసెన్సులు ఇప్పిస్తున్నారు. దారుణమైన విషయం ఏంంటే.. మద్యం అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజాప్రతినిధులకు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. ఎమ్మెల్యేలు, తమ బినామీలు, అనుచరుల ద్వారా వైన్ షాపులు నడుపుతారనేది బహరంగ రహస్యం.
Read Also: Kantara Chapter 1 : వాచిపోయిన కాళ్లు, అలసిన శరీరం – కాంతార విజయం వెనుక రిషబ్ శెట్టి గాధ
ఎన్నికల ప్రచారంలో మంచి మద్యం అమ్మకాలపై హామీ ఇచ్చిన రోజే ఏపీలో మన జీవితాల్లో నాణ్యమైన మద్యం తాగిస్తానిని.. అందుకు తగినట్టుగానే రెగ్యులర్ వైన్ షాపుల్లో మద్యం ఏరులై పారుతుంటే బెల్టు షాపుల్లో, పర్మిట్ రూముల్లో నకిలీ మద్యం సెలయేళ్లయి పారుతోంది. రాజకీయ అండదండలు, ఇతర వ్యవస్థల సహకారం లేకుండా ఎక్కడా ఇలాంటి నకలీ దందాలు జరగవు. మాకేం సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నా.. వాస్తవాలు జనానికి అర్ధమవుతాయి. తాగీతాగీ ఎలాగూ జనం లివర్లు కుళ్లిపోతున్నాయి. కనీసం నైతికంగానైనా ఆలోచించి నకిలీ మద్యం రాకెట్లను కంట్రోల్ చేస్తే జనానికి ఎంతోకొంత మేలు చేసినవారవుతారు. మద్యం లేకుండా ప్రభుత్వాలు నడపలేని పరిస్థితి వచ్చేసింది. కనీసం నకిలీ మద్యం లేకుండా వ్యవస్థల్ని నడపగలిగితే అదే పదివేలు.