Kaivalya Vohra: పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు.. సంపాదన మాత్రం వెయ్యి కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ కుర్రాడి వయస్సు పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు.. సంపాదన మాత్రం వెయ్యి కోట్లు అంటే అంతా నోరు వెల్లబెట్టాల్సిందే.. అంతేకాదండోయో… రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డు సృష్టించాడు… అతను ఎవరో కాదు.. Zepto సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా. అతి చిన్న వయసులోనే.. అంటే 19 ఏళ్ల వయసులోనే.. కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తుల జాబితాలో నిలిచాడు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా తాజాగా విడుదల చేసిన ధనవంతుల జాబితా 2022లో కైవల్య వోహ్రా రూ. 1,000 కోట్లతో 1,036వ స్థానంలో నిలిచారు.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
కైవల్య వోహ్రా 2020లో ఆదిత్ పలిచతో కలిసి కిరాణా వస్తువులు డెలివరీ చేసే జెప్టో యాప్‌ను ప్రారంభించాడు.. రూ.1000 కోట్ల నికర విలువతో కైవల్య వోహ్రాను ఈ జాబితాలో నిలిపింది. ఇక, పలిచ వయస్సు కూడా 20 ఏళ్లే కావడం మరో విశేషం. అతను రూ.1,200 కోట్ల నికర ఆస్తులతో ఈ జాబితాలో చోటు సంపాదించారు.. స్టాండ్‌ఫర్డ్ యూనివర్సిటీ డ్రాపౌట్స్ అయిన ఈ ఇద్దరు యువకులు ఒక సృజనాత్మక ఆలోచనతో Zepto స్థాపించి కోట్లు ఆర్జిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. మరోవైపు ఆ జాబితా ప్రకారం.. 1990ల్లో పుట్టిన 13 మంది యువకులు స్వయం కృషితో ఎదిగి కోటీశ్వరుల జాబితాలో నిలిచారు. మేలో, వైసీ కంటిన్యూటీ ఫండ్ నేతృత్వంలోని రౌండ్ నుండి Zepto 200 మిలియన్ డాలర్లను సేకరించింది. పెట్టుబడి తర్వాత, స్టార్ట్-అప్ దాని విలువను దాదాపు రెట్టింపు చేసి 900 మిలియన్ డాలర్ల మార్కును తాకింది. డిసెంబర్‌లో దీని విలువ 570 మిలియన్ డాలర్లుగా ఉంది..
కైవల్య వోహ్రా స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. Zepto కంటే ముందు, అతను మే 2020లో కిరాణాకార్ట్ అనే మరో కిరాణా డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ను స్థాపించాడు. ‘జెప్టో సెకండ్’ అని పేరు పెట్టారు.. ఇది చాలా తక్కువ సమయంలో నిమిషాల్లో కిరాణా డెలివరీని వాగ్దానం చేస్తుంది. వోహ్రా మరియు పలిచ.. వాణిజ్య సంస్థను నిర్మించాలనే ప్రణాళికతో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత జెప్టోను స్థాపించారు. ఇది ప్రారంభించినప్పుడు, 10 నిమిషాల డెలివరీకి హామీ ఇచ్చింది. అయితే, అది తర్వాత నిమిషాల్లో డెలివరీగా మార్చారు.. 2023లో భారతదేశంలోని 24 నగరాల్లో విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.. ప్రస్తుతం, ఇది 11 నగరాల్లో పనిచేస్తుంది. ఇది అనేక నగరాల్లో రౌండ్-ది-క్లాక్ డెలివరీని కూడా చూస్తోంది. అయితే, ఇటీవల, జెప్టో.. బ్లింకిట్ నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. జొమాటో జూన్‌లో 700 మిలియన్ల విలువతో బ్లింకిట్‌ను కొనుగోలు చేసింది. దీనిని గతంలో గ్రోఫర్స్ అని పిలిచేవారు.
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!