Instagram Down: ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. యూజర్లకు ఇక్కట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Down: ప్రస్తుతం సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్. దాదాపుగా అందరూ వీటిని వాడుతున్నారు. యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ మీదే ఆధారపడుతోంది. ఇన్‌స్టా రీల్స్ చూస్తూ సమయం గడిపేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాడు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలామంది అకౌంట్లు లాక్ అయిపోయినట్లు ఫిర్యాదులు పోటెత్తాయి. తమ యాప్ క్రాష్ అవుతోందని పలువురు యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. సుమారు 7వేల అకౌంట్లు సస్పెండ్ అయినట్లు సమాచారం అందుతోంది. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించిన ఇన్‌స్టాగ్రామ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. సస్పెండ్ అయిన అకౌంట్లను పునరుద్ధరించేందుకు ఈమెయిల్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను యూజర్ల నుంచి రాబడుతోంది.
Read Also: Karthika Masam : కార్తీకమాసంలో ఈ ఆహారాలను తినకూడదు
Also Read
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
- 50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
కాగా పలువురు యూజర్లకు ఎదురైన అంతరాయానికి ఇన్‌స్టాగ్రామ్ క్షమాపణలు తెలియజేసింది. అయితే ఆయా అకౌంట్లు ఎందుకు సస్పెండ్ అయ్యాయనే కారణాలను మాత్రం ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం వెల్లడించలేదు. ఇటీవల వాట్సాప్ సేవలు కూడా ఇలాగే నిలిచిపోగా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వంతు వచ్చింది. ఈ రెండు ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాలు కావడం గమనించాల్సిన విషయం. కొన్నిరోజుల క్రితం వాట్సాప్ సేవలు నిలిచిపోవడంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ విపరీతంగా పేలాయి. వాట్సాప్‌కు గ్రహణం పట్టిందని నెటిజన్‌లు జోకులు కూడా వేసుకున్నారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడం నెలన్నర రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గతంలో సెప్టెంబర్ 23న కూడా ఇన్‌స్టాగ్రామ్ సేవలలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!