Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambaraala Yetigattu Glimpse: మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్ హీరోగా కొత్త డైరెక్టర్ రోహిత్ కేపీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’ (SYG). హనుమాన్ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా రిలీజ్ అయిన ‘అసుర ఆగమనం’ స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన వీడియోలో సాయిదుర్గా తేజ్ మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్, ఊరమాస్ అవతారంలో కనిపించారు. బానిసత్వం, గనులు, అణచివేత నేపథ్యంలో సాగే స్టోరీతో.. ఒక యోధుడిలా తిరుగుబాటు బావుటా ఎగరేసే పాత్రలో తేజ్ లుక్ పూనకాలు తెప్పించేలా ఉంది. “అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం!” అంటూ గంభీరమైన వాయిస్‌తో కత్తిని గాల్లోకి లేపుతూ తేజ్ ఇచ్చిన ఎంట్రీ గ్లింప్స్‌కే మెయిన్ హైలైట్‌గా నిలిచింది.
బీజే అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్స్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించాయి. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుండగా, త్వరలోనే పాటల రిలీజ్‌కి రంగం సిద్ధం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అత్యంత క్రేజీగా రూపొందుతున్న ‘సంబరాల ఏటిగట్టు’ను పండుగ కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నారు. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉన్నప్పటికీ, కంటెంట్‌పై ఉన్న అమితమైన నమ్మకంతో మేకర్స్ ఈ బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే సాయిదుర్గా తేజ్ ఖాతాలో కెరీర్ బెస్ట్ హిట్ పడటం ఖాయంగా కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
తాజావార్తలు
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!