దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస లాభాలకు బ్రేక్ పడింది. వరుసగా రెండ్రోజులు సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బుధవారం మాత్రం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాయతీ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలు మన మార్కెట్‌ను దెబ్బకొట్టింది. సెన్సెక్స్ 131 పాయింట్లు నష్టపోయి 82, 948 దగ్గర ముగియగా.. నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 25, 377 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Balmoor Venkat : ప్రజల్లో రాహుల్‌గాంధీపై పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకపోతున్నారు
నిఫ్టీ అత్యధికంగా నష్టపోయిన వాటిలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో ఉండగా.. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా లాభపడ్డాయి. బ్యాంక్ మినహా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3 శాతానికి పైగా నష్టపోవడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆటో, ఫార్మా, మెటల్, ఆయిల్ & గ్యాస్ 0.5-1 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Haryana Election: మహిళలకు నెలకు రెండు వేలు.. పేదలకు వంద గజాల భూమి