దేశంలో బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకుంటున్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు స్వల్పంగా పెరిగాయి.. బంగారం ధర 10 గ్రాములపై రూ. 10 పెరిగింది.. అలాగే కిలో వెండి పై రూ. 100 మేర పెరిగింది… హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ పసిడి ధర రూ. 66,340 గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికొస్తే రూ. 60,810 కు చేరింది.. వెండి ధర కిలో రూ. 80,400 కు చేరింది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,530గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,020గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,380 కాగా.. 24 క్యారెట్ల 10 ధర రూ.65,870గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.60,900.. 24 క్యారెట్ల ధర రూ.66,440గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,380 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.65,870గా నమోదైంది..
ఇక వెండి ధరల విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడిచింది.. స్వల్పంగా పెరుగుదల కనిపించింది.. కిలో వెండిపై రూ.100 పెరిగి .. రూ.77,000లుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000 కాగా.. ముంబైలో రూ.77,000గా ఉంది. చెన్నైలో రూ.80,000గా కొనసాగుతుండగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,400లుగా ఉంది. తక్కువగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,800గా ఉంది.