Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Telecom User Base Grows To 1 17 Bn With Jio Taking Lead In New Addition

Reliance Jio: మళ్లీ సత్తా చాటిన జియో.. ఎవరి స్థానం ఏంటి..?

Published Date :August 18, 2022 , 8:55 am
By Sudhakar Ravula
Reliance Jio: మళ్లీ సత్తా చాటిన జియో.. ఎవరి స్థానం ఏంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో.. మరోసారి సత్తా చాటింది.. ఆ మధ్య కొత్త కస్టమర్లను యాడ్‌ చేసుకోవడం అటుంచితే.. ఉన్నవారినే కోల్పోయిన సందర్భాలున్నాయి.. అయినా.. నెంబర్‌ వన్‌గా కొనసాగుతూ వచ్చింది ఆ సంస్థ.. తాజాగా.. మళ్లీ కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటూ దూకుడు చూపిస్తోంది.. జూన్ నెలకుగాను టెలికం సంస్థల యూజర్ల డేటాను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.. జియో మరోసారి అదరగొట్టింది. టెలికం రంగంలోని మిగతా సంస్థల కంటే.. ముందు నిలిచింది రిలయన్స్‌ జియో..

Read Also: Astrology : ఆగస్టు 18, గురువారం దినఫలాలు

తాజాగా ట్రాయ్ ప్రకటించిన నివేదిక ప్రకారం.. జూన్ మాసంలో జియోకు కొత్తగా 42 లక్షల మంది యూజర్లు వచ్చి చేరగా.. జియో నెలవారి వృద్ధి ఏకంగా 1.03 శాతంగా ఉన్నట్టు పేర్కొంది ట్రాయ్.. తాజాగా కొత్త సబ్‌స్కైబర్లతో కలిపి జియో యూజర్ల సంఖ్య 41.30 కోట్లకు చేరడం విశేషం.. టెలికం రంగంలో 36 శాతం మార్కెట్ షేర్‌తో రిలయన్స్ జియో టాప్‌ స్పాట్‌ చెక్కు చెదరకుండా చేసుకుంది.. ఇదే సమయంలో.. వృద్ధిపరంగా చూసుకుంటే జియో కంటే ఎయిర్‌టెల్‌ వెనుకపడింది. జూన్‌ నెలలో ఎయిర్‌టెల్‌కు కొత్తగా 7,93,132 మంది యూజర్లును యాడ్‌ చేసుకుని తన సబ్‌స్క్రైబర్ల సంఖ్యను 36.29 కోట్లకు పెంచుకుంది.. దీంతో.. భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతోంది భారతీ ఎయిర్‌ టెల్.. అయితే, వొడాఫోన్ ఐడియా మాత్రం తన సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దీని సబ్‌స్క్రైబర్ బేస్ 18 లక్షలు తగ్గి 25.66 కోట్లకు పరిమితమైంది.. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్ మరియు ఎంటీఎన్‌ఎల్‌ కూడా వరుసగా 13.27 లక్షలు మరియు 3,038 వైర్‌లెస్ కస్టమర్లను కోల్పోయింది..

ఇక, వైర్‌లైన్ (ఫిక్స్‌డ్ లైన్) సబ్‌స్క్రైబర్ బేస్ మేలో 2.52 కోట్ల నుండి జూన్‌లో 2.55 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో 2.4 లక్షల కొత్త ఫిక్స్‌డ్ లైన్ కస్టమర్‌లను జోడించడం ద్వారా చార్ట్‌లో ముందుంది. దాని తర్వాత వొడాఫోన్ ఐడియా 84,760 కొత్త కస్టమర్లను, భారతీ ఎయిర్‌టెల్ 59,289, క్వాడ్రంట్ 7,378 కొత్త కస్టమర్లను జోడించాయి. ఈ విభాగంలో అత్యధికంగా నష్టపోయినది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌.. 32,038 మంది ఫిక్స్‌డ్ లైన్ కస్టమర్లను కోల్పోయింది. ఇక, ఎంటీఎన్‌ఎల్‌ 16,548 మంది వినియోగదారులను, టాటా టెలిసర్వీసెస్ 8,248 మంది వినియోగదారులను కోల్పోయింది. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ బేస్ 80 కోట్లకు చేరుకుంది, మొబైల్ కనెక్షన్‌లతో 77.11 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.

ట్రాయ్ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం, టెలికం రంగంలో.. రిలయన్స్ జియో గరిష్ట సంఖ్యలో కొత్త కస్టమర్లను చేర్చుకోవడంతో జూన్‌లో దేశంలో టెలికాం సబ్‌స్క్రైబర్ బేస్ స్వల్పంగా పెరిగి 117.29 కోట్లకు చేరుకుంది. మే 2022లో 117.07 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. భారతదేశంలో టెలిఫోన్ చందాదారుల సంఖ్య మే 2022 చివరి నాటికి 1,170.73 మిలియన్ల నుండి జూన్ 2022 చివరి నాటికి 1,172.96 మిలియన్లకు పెరిగింది, తద్వారా నెలవారీ వృద్ధి రేటు 0.19 శాతంగా ఉంది ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది. వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ బేస్ మేలో 114.55 కోట్లుగా ఉంటే జూన్‌లో 114.73 కోట్లకు పెరిగింది. ఈ సర్వీస్ ప్రొవైడర్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (41.91 కోట్లు), భారతీ ఎయిర్‌టెల్ (21.94 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.29 కోట్లు), బీఎస్‌ఎల్‌ఎల్‌ (2.5 కోట్లు), అట్రియా కన్వర్జెన్స్ (21.1 లక్షలు)గా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bharti airtel
  • BSNL
  • Jio
  • Reliance Jio
  • Telecom subscriber

తాజావార్తలు

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

  • Male Contraception: పురుషులకు కొత్త జనన నియంత్రణ వచ్చేస్తోంది.. కార్నెల్ యూనివర్సిటీ గేమ్ చేంజర్

  • Mukul Chaudhary: తండ్రి పెళ్లి కాకముందే కన్న కల.. నేడు ఐపీఎల్‌లో నిజం చేసిన కొడుకు.. ముకుల్ ఎమోషనల్ జర్నీ!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions