TCS: “15 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసిన చోటుకు వెళ్లాలి”.. కేంద్రానికి ఉద్యోగుల ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల 2000 మంది ఉద్యోగులను టీసీఎస్ ట్రాన్స్ఫర్ చేసింది. బదిలీ చేసిన ప్రాంతానికి వెళ్లి విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు 2 వారాల సమయం ఇచ్చింది. ఒక వేళ వారికి కేటాయించిన కొత్త స్థానాలకు వెళ్లని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ఇప్పటికే 2 వేల మంది ఉద్యోగులకు టీసీఎస్ ట్రాన్స్ఫర్ నోటీసులను ఇచ్చింది. ఈ ఉద్యోగులు వేరేవేరే ప్రాంతాలకు బదిలీ కావడంతో వారికి రెండు వారాలు గడువు ఇచ్చింది. దీంతో పాటు ఉద్యోగులకు ప్రయాణ, వసతి ఖర్చులను కూడా ఇవ్వనుంది. కంపెనీ ఆర్డర్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేసిన చోటుకు వెళ్లకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆగస్టు నెలాఖరు నుంచి టీసీఎస్ ఉద్యోగులకు ఈ రీలొకేషన్ నోటీసులు అందాయని మనీ కంట్రోల్ నివేదిక పేర్కొంది.
Also Read
- Crude Oil Price Today: బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
Read Also: Uttar Pradesh: యూపీలో దొంగల దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్, సిగరెట్లతో కాలుస్తూ అఘాయిత్యం..
ఇలా ఆకస్మికంగా బదిలీ చేయడంపై పలువురు ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. దాదాపుగా 180 మంది ఉద్యోగులు ఐటీ ఉద్యోగుల యూనియన్ NITESకి ఫిర్యాదు చేశారు. సరైన నోటీసు లేకుండా, సంప్రదింపులు లేకుండా తనను బదిలీ చేసిన చోటుకు వెళ్లమని కంపెనీ బలవంతం చేస్తుందని ఫిర్యాదు చేశారు. ఇది ఉద్యోగులను, వారి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల తరుపున ఐటీ యూనియన్.. అనైతిక బదిలీ పద్దతులపై టీసీఎస్‌పై కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.
కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని కల్పించింది. దాదాపుగా రెండేళ్ల నుంచి ఉద్యోగులు ఇదే విధానంలో పనిచేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో అన్ని సంస్థలు కూడా ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రీడ్ మోడ్‌లో పనిచేయాలని చెబుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు భవిష్యత్తు సంఘర్షణలో ఉంది. ఇప్పటికే పలు ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి భయాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని, లేకపోతే చర్యలు ఉంటాయని సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!