TCS: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల 2000 మంది ఉద్యోగులను టీసీఎస్ ట్రాన్స్‌ఫర్ చేసింది. బదిలీ చేసిన ప్రాంతానికి వెళ్లి విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు 2 వారాల సమయం ఇచ్చింది. ఒక వేళ వారికి కేటాయించిన కొత్త స్థానాలకు వెళ్లని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.