PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పెట్టుబడిదారులకు సెప్టెంబర్ 30వ తేదీ ముఖ్యమైనది. పీపీఎఫ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), కిసాన్ వికాస్ పత్ర (KVP) వంటి పథకాలపై అక్టోబర్-డిసెంబర్ 2026 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లను ప్రభుత్వం సెప్టెంబర్ 30న సమీక్షించనుంది. గత జూన్ 30న జరిగిన త్రైమాసిక సమీక్షలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు మరోసారి రేట్లు మారుతాయా లేదా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతాయా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ పథకాల వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ప్రభుత్వ బాండ్ల రాబడి కీలక పాత్ర పోషిస్తుంది. జూన్ చివరి నుంచి లాంగ్ టర్మ్ ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ లో స్వల్ప పెరుగుదల నమోదైంది. ఉదాహరణకు జూన్ 30 నాటికి సుమారు 6.74 శాతం ఉన్న 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్, సెప్టెంబర్ 22 నాటికి దాదాపు 7.05 శాతానికి పెరిగింది. అంటే ఈ కాలంలో సుమారు 31 బేసిస్ పాయింట్ల వృద్ధి కనిపించింది. బాండ్ ఈల్డ్ పెరిగినంత మాత్రాన ప్రభుత్వం అదే నిష్పత్తిలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతుందని చెప్పలేము. దీనిపై తుది నిర్ణయం పూర్తిగా ప్రభుత్వానిదే.
Also Read
- ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వీటిలో వచ్చే చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో అందే మొత్తం రిటర్న్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అలాగే కిసాన్ వికాస్ పత్రలో వడ్డీ రేటుతో పాటు మెచ్యూరిటీ కాల వ్యవధి కూడా ఇన్వెస్టర్లకు చాలా కీలకం. ప్రభుత్వ అధికారిక ప్రకటన వెలువడే వరకు వడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత రాదు. సెప్టెంబర్ 30న వెలువడే ఈ కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తదుపరి మూడు నెలల కాలానికి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం ఉండగా.. సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.
తాజావార్తలు
-
ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!