స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 800 ప్లస్‌లో వుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు నుంచి సానుకూల పవనాలకు తోడు కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 820 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ 16,500 పైన ట్రేడవుతోంది.
ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 820 పాయింట్ల లాభంతో 55,704 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 237 పాయింట్ల వృద్ధితో 16,589 వద్ద కొనసాగుతోంది. ఇవాళ లాభాల్లో కొనసాగుతున్న కంపెనీ షేర్లలో ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, విప్రోలు వున్నాయి. ఈ షేర్లు 2 శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, కొటక్ మహీంద్రాలు నష్టాల్లో ట్రేడవుతున్నట్టు స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
జూన్ 6–8 తేదిల్లో జరిగే ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాల తర్వాత వాటి ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద పడనుంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణులు అంటున్నారు. వివిధ కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతాయని వార్తలు రావడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ షేర్లను భారీగా అమ్మేశారని అంటున్నారు.
Petrol Prices: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు