దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 616 పాయింట్ల లాభంతో 53,750 వద్ద ముగియగా.. నిఫ్టీ 178 పాయింట్ల లాభంతో 15,989 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో ఉదయం నుంచి లాభాల్లోనే ట్రేడయిన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. సెన్సెక్స్‌లో బ్రిటానియా, బజాజ్ ఫిన్సర్వ్, హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాలను ఆర్జించగా… ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కో షేర్లు నష్టాలను చవిచూశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.79.11గా ట్రేడవుతోంది.
Read Also:Fraud Case: బోర్డు తిప్పేసిన కంపెనీ.. రూ. 50 కోట్ల భారీ మోసం
మరోవైపు తెలుగు రాష్ట్రాలలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.800 తగ్గి రూ.53,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2వేలు తగ్గి రూ.58,130 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1,768 డాలర్లు పలుకుతోంది. ఔన్స్ వెండి ధర 19.15 డాలర్లుగా పలుకుతోంది.